Share News

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం..

ABN , Publish Date - Apr 02 , 2025 | 08:43 PM

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్లోని నిషినూమోటే ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చినట్లు అక్కడి..

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం..
japan earthquake

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యుషులో బుధవారం సాయంత్రం 7:34 గంటలకు భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, భూకంపం కారణంగా సంభవించిన నష్టాలపై ఇంకా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.

ఇప్పటికే వరుస భూప్రకంపనలతో మయన్మార్ వణికిపోయింది. మార్చి 26వ తేదీన మయన్మార్, థాయిలాండ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన నాలుగైదురోజులకే జపాన్‌లో భూకంపం సంభవించడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇకపోతే మయన్మార్, థాయ్‌లాండ్‌ల సంభవించిన భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం, విధ్వంసం సంభవించింది. ముఖ్యంగా మయన్మార్‌లో మృతుల సంఖ్య 3,000 దాటింది.


ఇదిలాఉంటే.. జపాన్ ప్రభుత్వం సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. పసిఫిక్ తీరంలో చాలా కాలంగా అంచనా వేస్తున్న మెగా భూకంపం సంభవించినట్లయితే ఆ దేశ స్వరూపమే మారిపోయే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు.. జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.81 ట్రిలియన్ల డాలర్లు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ భూకంపం వల్ల వినాశకరమైన సునామీలు సంభవించవచ్చని, వందలాది భవనాలు కూలిపోయే అవకాశం ఉందని, దాదాపు 3,00,000 మంది మరణించే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలనే అత్యంత తరచుగా భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఆ దేశ సమీప సముద్రగర్భంలో 8 నుంచి 9 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం 80 శాతం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇలాంటి తరుణంలో తాజాగా జపాన్‌లో భూకంపం సంభవించడం.. ఆ దేశాన్ని మరింత కలవరానికి గురి చేస్తుంది.

Updated Date - Apr 02 , 2025 | 08:56 PM