హమాస్‌పై ఇజ్రాయెల్ లక్షిత దాడులు
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:31 AM
గాజాపై ఇజ్రాయెల్ లక్షిత దాడులు ఉధృతమవ్వడంతో.. హమా్‌సకు భారీ దెబ్బ తగిలింది.
ఇద్దరు కీలక కమాండర్లు, 14 మంది ఫైటర్లు మృతి
టెల్‌అవీవ్, జనవరి 1: గాజాపై ఇజ్రాయెల్ లక్షిత దాడులు ఉధృతమవ్వడంతో.. హమా్‌సకు భారీ దెబ్బ తగిలింది. మంగళవారం దక్షిణ గాజాలోని ఖాన్ యూని్‌సలో జరిపిన ఆపరేషన్‌లో హమాస్ నుఖ్బా ప్లటూన్ కమాండర్ అబేద్ అఅల్-హాదీ సభా, ఉత్తర గాజాపై నిర్వహించిన దాడుల్లో మరో కమాండర్ మహమ్మద్ సాదీ మాస్రీ మృతిచెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) బుధవారం ఎక్స్‌లో వెల్లడించింది. వీరిద్దరూ అక్టోబరు 7 నాటి దాడుల్లో పాల్గొన్నట్లు తెలిపింది. అటు సెంట్రల్ గాజాలో నిర్వహించిన ఆపరేషన్‌లో 14 మంది హమాస్ ఫైటర్లు హతమయ్యారని, వీరిలో ఆరుగురు అక్టోబరు 7 దాడుల్లో పాల్గొన్నట్లు వెల్లడించింది.