Viral Video: మరీ అంత ఓవరాక్షన్ అవసరమా..
ABN , Publish Date - Mar 26 , 2025 | 09:50 PM
సంఘటనకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రన్నర్ చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలానే ఉంటుందంటూ మండిపడుతున్నారు. ఒక సెకన్ తేడాతో ఆమె జీవితం మారిపోయింది. అంతా చేసి.. ఇప్పుడు బాధపడుతోంది.

Too Early To Celebrate అని ఇంగ్లీష్‌లో ఓ లైన్ ఉంటది. దీని అర్థం ఏంటంటే.. గెలుపు పూర్తిగా సొంతం కాకుండా సంబరాలు చేసుకోవటం మంచిది కాదని. పాపం చైనాకు చెందిన ఓ లేడీ రన్నర్‌కు ఈ విషయం తెలీదనుకుంటా.. గెలుపు సొంతం కాకముందే అతి చేసింది. సెకనులో జీవితం తారుమారైంది. చివరకు కర్మ అనుభవించింది. ఫస్ట్ ఫ్రైజ్ గెలవాల్సిన ఆమె రెండో స్థానానికి పడిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 35 ఏళ్ల క్షియావో ఫెన్ అనే మహిళ శనివారం మారథాన్ రన్నింగ్‌లో పాల్గొంది. అందరికంటే వేగంగా పరిగెత్తి ఫినిషింగ్ లైన్ దగ్గరకు చేరుకుంది. విజయానికి అత్యంత చేరువ అయింది. దీంతో ఆమె సంతోషం పట్టలేకపోయింది.
ఫినిషింగ్ లైన్‌కు అడుగుల దూరంలో ఉన్నపుడే సంబరాలు మొదలెట్టింది. దీన్ని ఆమె ప్రత్యర్థి అయిన జాన్ జిఫాంగ్ అదునుగా తీసుకుంది. వెంటనే క్షియావోను దాటి లైను మీద అడుగుపెట్టింది. కేవలం ఒకే ఒక సెకన్‌లో విజయం తిరగబడింది. జిఫాంగ్ గెలిచింది. క్షియావో రెండో స్థానానికి పరిమితమైంది. అప్పుడు కానీ, తెలియలేదు.. తను చేసిన తప్పేంటో అని. మొదటి బహుమతి చేజారటంతో క్షియావో చాలా బాధపడింది. ఎంత బాధపడితే ఏం లాభం ఉంటుంది. చేసిన తెలివి తక్కువ పనికి శిక్ష అనుభవించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు క్షియావోపై ఫైర్ అవుతున్నారు.
‘ ప్రజల్ని ఆకర్షించడానికి అలా చేసి ఉంటుంది’..‘ ఫినిషింగ్ లైన్ ముందు అంత ఓవర్ యాక్షన్ అవసరమా?.. అందుకే అలా జరిగింది’.. ‘ అందుకే ఇళ్లు అలకగానే పండుగ కాదని పెద్దలు అంటూ ఉంటారు’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇలా ఫినిషింగ్ లైన్ దగ్గర సంబరాలు చేసుకుని రెండో స్థానానికి పడిపోయిన వారు చాలా మందే ఉన్నారు. 2021లో మాట్టియో బుస్టోస్ అనే వ్యక్తి ఫినిషింగ్ లైను దగ్గర సంబరాలు చేసుకున్నాడు. అతడి ప్రత్యర్థి దాన్ని అదునుగా తీసుకుని ముందుకెళ్లిపోయాడు. ఫస్ట్ వచ్చాడు. 2024లోనూ ఇలాంటి ఘటన జరిగింది. జేక్ ఓడే జోర్డాన్ అనే రన్నర్ ఫినిషింగ్ లైను దగ్గర సంబరాలు మొదలెట్టాడు. అతడి ప్రత్యర్థి ముందుకు దూసుకెళ్లిపోయాడు. ఫస్ట్ ఫ్రైజ్ కొట్టేశాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: మరీ అంత ఓవరాక్షన్ అవసరమా..
ఇవి కూడా చదవండి:
AIADMK-BJP Tie-up: కమలం పార్టీతో పొత్తుపై తేల్చిచెప్పిన పళనిస్వామి
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..