Share News

NASA: ఇంటికొస్తున్న సునీతా విలియమ్స్.. వచ్చే టైం ప్రకటించిన నాసా

ABN , Publish Date - Mar 17 , 2025 | 09:12 AM

ఎట్టకేలకు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్ సహా పలువురు తిరిగి భూమికి వచ్చేస్తున్నారు. అయితే వీరు ఏ సమయానికి వస్తారనే దానిపై తాజాగా నాసా కీలక ప్రకటన చేసింది.

NASA: ఇంటికొస్తున్న సునీతా విలియమ్స్.. వచ్చే టైం ప్రకటించిన నాసా
NASA Sunita Williams

అంతరిక్షంలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రయాణం చివరి దశకు చేరుకుంది. అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి సమయం ఆసన్నమైంది. NASA తాజా ప్రకటన ప్రకారం మార్చి 19, మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం 3:27AM) వీరు భూమికి తిరిగి రానున్నారు. ఇక అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమిపై ల్యాండ్ కానున్నారు.


రాకపై ఆసక్తి

ఈ ఇద్దరు వ్యోమగాములు 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు. అయితే, బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షన్ సమస్యల కారణంగా, వారిని తిరిగి భూమికి తీసుకురావడం ఆలస్యమైంది. సాధారణంగా వ్యోమగాములు ISSలో 6 నెలలు గడిపితే, ఈ జంట మాత్రం దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ అనుకోని ఆలస్యం కారణంగా, వీరు రాకపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. NASA ప్రకటన ప్రకారం, SpaceX క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ వీరిని భూమికి తిరిగి తీసుకురానుంది. ఈ ప్రయాణంలో మరొక అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు.


అంతరిక్ష ప్రయాణంలో ఎదురైన సవాళ్లు

ప్రత్యేకించి, సునీతా విలియమ్స్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక సాధారణ మిషన్ కంటే, ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. ఊహించని విధంగా మరింత కాలం అక్కడే ఉండిపోవడం వారికి మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగించాయి. అంతేకాదు, ఈ పొడిగింపు కారణంగా, అదనపు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని NASA వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది.

సాధారణంగా, వ్యోమగాములు అంతరిక్షంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు వారితో వీడియో కాల్‌లు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాలేకపోవడంతో, కుటుంబాల నుంచి దూరంగా ఉండటం పెద్ద సవాలుగా మారింది. అయితే, వీరి సహచర వ్యోమగాముల సహకారం, ISSలో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతునిచ్చాయని చెప్పవచ్చు.


సునీతా విలియమ్స్ రికార్డ్

ఈ తొమ్మిది నెలల మిషన్ ద్వారా సునీతా.. US వ్యోమగామి ఫ్రాంక్ రూబియో 2023లో నెలకొల్పిన 371 రోజుల రికార్డును అందుకోలేకపోయినా, ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లోనే చాలా ముఖ్యమైన ఒక మిషన్‌గా నిలిచింది. అంతేకాదు, ISSలో పొడవైన కాలం గడిపిన మరికొన్ని ప్రముఖ వ్యోమగాముల జాబితాలో ఆమె చేరిపోయారు.


ప్రత్యక్ష ప్రసారం

NASA ప్రకారం ఫ్లోరిడా తీరంలోని సముద్ర ప్రాంతంలో మార్చి 19న (భారత కాలమానం ప్రకారం ఉదయం 3:27 గంటలకు) వీరి క్యాప్సూల్ నీటిలో దిగి, అక్కడి నుంచి విమాన మార్గంలో వీరిని NASA కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. ఈ ప్రక్రియను NASA ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మార్చి 18న భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ఈ లాండింగ్ సన్నాహాల గురించి NASA ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనుంది.


ఇవి కూడా చదవండి:

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 17 , 2025 | 01:21 PM