US Strikes: నరకం చూపిస్తా.. హౌతీలకు ట్రంప్ వార్నింగ్
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:08 AM
మొన్నటి వరకు ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం నిర్వహించింది. ఇప్పుడు తాజాగా మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధ పరిస్థితి నెలకొన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే యెమెన్‌లో హౌతీలపై అమెరికా దాడులు ఉధృతం చేసింది.

అమెరికా ఎర్ర సముద్రంలో షిప్పింగ్ మార్గాలను అరికట్టేందుకు హౌతీలపై దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే యెమెన్ రాజధాని సనా, సాదా ప్రావిన్స్‌లో అమెరికా చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) హౌతీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మీ సమయం ముగిసిందని, ఇకపై తీవ్రమైన ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
యెమెన్‌పై అమెరికా దాడుల ప్రభావం
అమెరికా చేపట్టిన తాజా వైమానిక దాడుల కారణంగా, సనాలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, సాదా ప్రావిన్స్‌లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా 11 మంది మరణించారు. అమెరికా దాడుల నేపథ్యంలో యెమెన్ ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు. పేలుళ్లు భయంకరంగా ఉన్నాయని, అవి భూమిని కంపించేలా చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో తమ పిల్లలతోపాటు అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
మరో దేశానికి కూడా హెచ్చరికలు..
మేము మా లక్ష్యాన్ని సాధించే వరకు దాడులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. ఈ రోజు నుంచి మీ దాడులు ఆగిపోవాలని, లేకపోతే మీరు ఇంతకు ముందు చూడని విధంగా మీపై నరక వర్షం పడుతుందని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. దీంతోపాటు ఇదే సమయంలో హౌతీలకు మద్దతునిచ్చే ఇరాన్‌పై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్ హౌతీలకు మద్దతు ఇవ్వడం వెంటనే ఆపేయాలని సూచించారు.
ఇరాన్ రియాక్షన్
ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చి అమెరికాకు ఇరాన్ విదేశాంగ విధానాన్ని నిర్ణయించే అధికారం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ మారణహోమానికి సపోర్ట్ చేయడం మానుకోవాలని, యెమెన్ ప్రజలను చంపడం ఆపాలని మంత్రి X వేదికగా పేర్కొన్నారు. ఈ దాడుల నేపథ్యంలో హౌతీల రాజకీయ విభాగం ఈ దాడులను యుద్ధ నేరంగా అభివర్ణించింది. మేము తగిన విధంగా ప్రతిస్పందించాల్సి వస్తుందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఈ దేశాల మధ్య కూడా యుద్ధం వచ్చేలా ఉంది.
గతంలో అమెరికాపై..
హౌతీలు గత దశాబ్దంగా యెమెన్‌లో పెద్దఎత్తున ప్రభావం చూపిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం నుంచి హౌతీలు అమెరికా యుద్ధ నౌకలపై 174 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు దాడులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇటీవల హౌతీలను "విదేశీ ఉగ్రవాద సంస్థ"గా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
Terrorist Killed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సన్నిహితుడు హతం
Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!
Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News