Fridge Water: వేసవిలో అదేపనిగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యల్లో ఇరుకున్నట్లే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:14 PM
Side Effects Of Cold Water: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అందర్నీ అల్లాడిస్తున్నాయ్. వేడి తీవ్రతను భరించలేక చాలామంది ఫ్రిజ్ వాటర్ తాగి రిలాక్స్ అవుతుంటారు. ఎండల్లో చిల్లింగ్ వాటర్ తాగితే తప్పేముందని మీరు అనుకోవచ్చు. కానీ, దీని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మీరు ఊహించలేరు.

Side Effects Of Cold Water: ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా బాడీలో హీట్ నియంత్రణలో, పేగు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు నీరు ఎంతో అవసరం. ఒక్క నీరు తక్కువైతే చాలు. శరీరంలోని ప్రతి అవయవం పనితీరు క్రమం తప్పుతుంది. అందుకే సరైన పరిమాణంలో నీరు తాగడం చాలా ముఖ్యం. ప్రధానంగా వేసవిలో మరింత ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. మండే ఎండల్లో పదే పదే గొంతు ఎండుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది చల్లని నీరు. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉపయోగిస్తుండటం వల్ల మరో ఆలోచన చేయకుండా కూలింగ్ వాటర్ తాగేస్తున్నారు. ఇంతకీ ఫ్రిజ్ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనేది పుకారా లేదా నిజమా..
ఫ్రిజ్ చల్లని నీరు తాగడం సురక్షితమేనా?
ఫ్రిజ్‌లో కూలింగ్ చేసిన నీరు ఎండాకాలంలో తాగితే ఏం కాదని చాలామంది అభిప్రాయం. కూలింగ్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదని ఎవరైనా చెప్పినా మాకేం కాదని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని మనకు సరిపడతాయో లేదో తెలుసుకోకుండా ఫ్రిజ్ నీళ్లు తాగితే ఈ కింది దుష్ప్రభావాలు తప్పవు.
ఫ్రిజ్ నీళ్లు తాగితే వచ్చే సమస్యలు..
జీర్ణ సమస్యలు: సాధారణంగానే ఎక్కువ చల్లగా ఉన్న నీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఆహారం జీర్ణమవడం కష్టంగా మారుతుంది. పేగులు ముడుచుకుపోయి మలబద్ధకం, అజీర్తి సమస్యలు రావచ్చు. మనకు తెలియని అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు కూలింగ్ వాటర్ మరింత హానికరంగా మారుతుంది. జీర్ణసమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఊబకాయం: శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుకు చల్లటి నీరు తోడైతే కొవ్వు శాతం మరింత పెరుగుతుంది. బరువు తగ్గడంలో ఇబ్బందులు ఏర్పడి ఊబకాయం సమస్య పెరిగే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గాలన్నా, నియంత్రించుకోవాలన్నా గోరువెచ్చని నీటిని తాగలని నిపుణులు సూచిస్తున్నారు.
పంటి నొప్పి: ఎక్కువ చల్లగా ఉన్నా నీరు తాగితే పంటి నొప్పి, జివ్వుమన్న అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా దంతాలు చాలా సున్నితంగా ఉన్నవారికి లేదా నోటి సమస్యలు ఉన్నవారికి చల్లటి నీరు బాధాకర అనుభవాన్నే మిగులుస్తుంది.
గొంతు నొప్పి: చల్లటి నీరు కొంతమందికి అస్సలు సరిపోదు. అలాంటివారికి తాగిన వెంటనే గొంతు నొప్పిగా రావచ్చు. అప్పటికే గొంతు నొప్పి లేదా మరేదైనా సమస్య ఉన్నవారు చిల్లింగ్ వాటర్ తాగకపోవడమే మేలు.
తలనొప్పి: కొందరికి పదే పదే తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు చల్లటి నీటిని తాగితే మెదడు స్తంభించిపోయే ప్రమాదముంది. కూలింగ్ వాటర్ వెన్నెముకలోని సున్నితమైన నరాలను చల్లబరిచి మెదడుపై ప్రభావం పడుతుంది. ఈ కారణంగా తలపోటు మొదలవుతుంది.
గుండె జబ్బులు : గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. తీవ్రమైన ఎండల్లో చల్లని నీరు తాగాలనే కోరిక కలిగిన వెంటనే నియంత్రించుకునేందుకు ప్రయత్నించండి. చల్లటి నీరు రక్త నాళాలు వ్యాకోచించేలా చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం. వీలైనంత వరకూ తక్కువ చల్లగా ఉన్న నీటినే తాగండి.
ఫ్రిజ్ నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికీ పై సమస్యలు వస్తాయని స్పష్టమైన సమాచారం లేదు. ఒకవేళ ఫ్రిజ్‌లో కూల్ చేసిన నీళ్లు తాగిన తర్వాత మీ శరీరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని మీకనిపిస్తే చల్లని నీరు తాగవచ్చు.
Read Also: Parenting Tips: పిల్లలకు 'నో' అని తెగేసి చెప్తున్నారా..బీ కేర్‌ఫుల్.. ఈ విషయం గనక చెప్పకపోతే..
Deep Fried Foods: డీప్ ఫ్రై ఫుడ్స్ అంటే ఇష్టమా.. ఇలా చేసుకుని తిన్నా ఏం కాదంట..
Coriander Leaves: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి..