Milk Boiling: పాలు, టీ హీట్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోవాలి..
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:17 PM
Milk Boiling Hacks: పాలు లేదా టీ మరిగించేటప్పుడు తరచూ పొంగిపోతున్నాయా. ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నా గిన్నెలోంచి బయటికి చింది గ్యాస్ అంతా మురికిగా మారుతోందా.. ఇలాంటి ఇబ్బంది ఎప్పటికీ రాకుండా ఉండాలంటే.. ఈ 5 ట్రిక్స్ పాటించండి..

Milk Boiling : ఎంత అప్రమత్తంగా ఉన్నా పాలు లేదా టీ మరిగించేటప్పుడు పొంగిపోవడం సాధారణంగా అందరి ఇళ్లల్లో కనిపించేదే. ముఖ్యంగా మనం వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు.. పాలు లేదా టీ మరిగించే సమయంలో శ్రద్ధ చూపనప్పుడు. అధిక మంట కారణంగా నురుగు ఏర్పడటం.. తదితర కారణాల వల్ల పాలు లేదా టీ పొంగిపోవడం సర్వసాధారణం. కానీ, తరచూ ఇదే సమస్య ఎదురవుతుంటే ఆలోచించాల్సిందే. మాటిమాటికీ వేడి చేసేటప్పుడు పాలు గిన్నెలోంచి పొంగుకొచ్చి గ్యాస్ స్టౌవ్ పైన పడిపోవడం.. దాన్ని పదే పదే దానిని శుభ్రం చేసుకోవాల్సి రావడం అంటే ఎవరికైనా చికాకే. మిమ్మల్ని కూడా ఇదే సమస్య ఇబ్బంది పెడుతుంటే ఆందోళన చెందకండి. కింద చెప్పిన 5 ట్రిక్స్ పాటిస్తే ఈ సమస్య ఎప్పటికీ రాదు.
పాలు లేదా టీ పొంగకుండా ఉండే 5 చిట్కాలు..
నెయ్యి లేదా వెన్న..
మీరు పాలు లేదా టీ మరిగించేటప్పుడు పాత్ర పై అంచులకు కొద్దిగా నెయ్యి లేదా వెన్న రాయండి. ఇలా చేయడం వల్ల పాలు మరుగుతున్నప్పుడు నురుగు పైకి లేచినా గిన్నెలోంచి ఒలికిపోదు.
చెంచా..
టీ లేదా పాలు కాచే సమయంలో పాన్ పైన ఒక చెక్క చెంచా లేదా గరిటె ఉంచండి. ఇది నురుగు పెరగకుండా నిరోధిస్తుంది. అప్పుడు పాలు లేదా టీ బయటకు పోకుండా ఉంటాయి. గరిటె లేదా చెంచా చెక్కతో తయారు చేసినవైతే మరీ మంచిది. ఎందుకంటే చెక్క గరిటె పాల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
తక్కువ మంట..
పెద్ద మంటపై పాలు లేదా టీ మరిగించేందుకు ప్రయత్నిస్తే అవి త్వరగా వేడెక్కుతాయి. అలాంటి సందర్భాల్లోనే నురుగు ఎక్కువగా ఏర్పడి గిన్నెలోంచి పొంగిపోయే అవకాశముంది. ఇలా జరగకూడదంటే ఎప్పుడూ మీడియం లేదా తక్కువ మంట మీదే పాలు లేదా టీని మరిగిచండి. ఈ పద్ధతి వల్ల పాలు నెమ్మదిగా వేడెక్కుతి నురుగు వేగంగా, ఎక్కువగా ఏర్పడదు. కానీ, సరిగ్గా మరిగేలా మధ్య మధ్యలో పాలు లేదా టీని కలుపుతూ ఉండాలి.
పాత్రలో స్టీల్ చెంచా..
పాలు లేదా టీ వేడిచేసేటప్పుడు గిన్నెలో ఒక చిన్న స్టీల్ చెంచా వేయండి. అప్పుడు వేడి గిన్నెలో అన్ని వైపులకు సమానంగా పంపిణీ అవుతుంది. నురుగు ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. తద్వారా పాలు లేదా టీ పాత్ర గిన్నె నుంచి బయటకు పొంగిపోవు.
పెద్ద పాత్ర..
ఎక్కువ మొత్తంలో పాలు లేదా టీ మరిగించాల్సి వస్తే ఎప్పుడూ పెద్ద పాత్రను ఉపయోగించండి. ఎందుకంటే చిన్న పాత్ర త్వరగా నురుగుతో నిండిపోయి పాలు లేదా టీ బయటకు చిమ్ముతాయి. అదే పెద్ద పాత్రలో అయితే ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి మరిగేటప్పుడు నురుగు సులభంగా గిన్నెలోని ఖాళీ వైపులకు వ్యాపించి పొంగిపోయే అవకాశాలు తగ్గుతాయి.
Read Also: Egg Viral Video: గుడ్డు పెంకు ఈజీగా ఎలా తీశాడంటే.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా..
Pillow Covers: పిల్లో కవర్స్ ఎప్పుడు ఛేంజ్ చేస్తున్నారు.. ఎన్ని రోజుల తర్వాత మార్చాలో
Rat Control: ఎలుకల బాధతో విసిగిపోయారా.. ఇలా చేస్తే చంపకుండానే ఇంట్లో నుంచి మాయమవుతాయి..