Share News

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్

ABN , Publish Date - Mar 27 , 2025 | 08:43 AM

బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం జరిగిందనే వార్త సంచలనంగా మారింది. ఇది తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అసలేం జరిగింది.. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ పరిస్థితి ఏంటి.. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్
Aishwarya Rai car accident

మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ కారుకు ప్రమాదం జరిగింది. ముంబైలో ఆమె నివాసం ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐశ్వర్య రాయ్ లగ్జరీ కారును బస్సు గుద్దిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. ఐశ్వర్య కారుకు ప్రమాదం జరిగింది అని వార్త తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె బాగానే ఉందని.. ఎవరూ కంగారు పడవద్దని ఐశ్వర్య సన్నిహితులు చెబుతున్నారు.


ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐశ్వర్య రాయ్‌కు చెందిన ఐ ఎండ్ కారు వెనకగా ఓ బస్సు వచ్చింది. అయితే ఉన్నట్లుండి అది కారును ఢీ కొట్టింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ కారులో ఐశ్వర్య లేదని అధికారులు తెలిపారు.

కారుకు కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదని వెల్లడించారు. కారుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసిన వెంటనే జుహు తారా రోడ్డులోని అమితాబ్ బచ్చన్ బంగ్లాకు చెందిన బౌన్సర్ ఒకరు బయటకు వచ్చి.. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను కొట్టాడని అధికారులు వెల్లడించారు.


గొడవ జరుగుతుందని భావించిన బస్సు డ్రైవర్.. వెంటనే కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు రావడంతో.. అమితాబ్ బంగ్లాకు చెందిన సూపర్‌వైజర్ బయటకు వచ్చి.. బస్సు డ్రైవర్‌కు క్షమాపణలు చెప్పాడు. దాంతో వివాదం సద్దుమణిగింది. డ్రైవర్ బస్సు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

శబరిమలలో పూజ.. వివాదంలో మలయాళ సూపర్ స్టార్స్..

Updated Date - Mar 27 , 2025 | 08:45 AM