Share News

Anant Ambani: అనంత్‌ ‘టైమ్‌’.. చాలా కాస్ట్‌లీ బ్రో!

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:10 AM

ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న చేతి గడియారాన్ని చూశారా..!! చూడటానికి ఐసు ముక్కలా భలే ఉంది కదా.. మనం కూడా ఒకటి కొనేసుకుందాం అని అనుకుంటుంటే మాత్రం కాస్త ఆగండి.

Anant Ambani: అనంత్‌ ‘టైమ్‌’.. చాలా కాస్ట్‌లీ బ్రో!

అంబానీ రిస్ట్‌ వాచ్‌ ఖరీదు రూ.22 కోట్లు

ప్రపంచంలో ముగ్గురి వద్దే ఆ గడియారం

దిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న చేతి గడియారాన్ని చూశారా..!! చూడటానికి ఐసు ముక్కలా భలే ఉంది కదా.. మనం కూడా ఒకటి కొనేసుకుందాం అని అనుకుంటుంటే మాత్రం కాస్త ఆగండి. ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే మీ గుండెల్లో నిజంగానే ఐసు ముక్క పడుద్ది. అనంత్‌ అంబానీ ధరించిన ఈ చేతి గడియారం ఖరీదు రూ.22 కోట్ల పైమాటే. రిచర్డ్‌ మిల్లే కంపెనీకి చెందిన అత్యంత అరుదైన ఈ చేతి గడియారాలు ప్రపంచంలో మూడంటే మూడే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్‌ అంబానీ కుమారుడైన అనంత్‌ దగ్గర వాటిల్లో ఒకటి ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో అనంత్‌ ఈ గడియారంతో కనిపించాడు. ఓ ఇన్‌స్టాగ్రమ్‌ పేజీ ఈ చేతి గడియారం వివరాలను పోస్ట్‌ చేయగా... అనంత్‌ టైమ్‌ కూడా చాలా కాస్ట్‌లీ బ్రో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే కాదు.. రూ.కోట్ల విలువ చేసే వేర్వేరు కంపెనీలకు చెందిన మరికొన్ని చేతి గడియారాలు కూడా అనంత్‌ అంబానీ వద్ద ఉన్నాయి.

Updated Date - Jan 02 , 2025 | 05:10 AM