Share News

Rajya Sabha : ముస్లిం రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభలో రభస

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:26 PM

కర్నాటక ప్రభుత్వ టెండ‌ర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో రాజ్యసభ అట్టుడికింది

Rajya Sabha : ముస్లిం రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభలో రభస

ఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు (reservation for Muslims) కల్పిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇవాళ రాజ్యసభను అట్టుడికించింది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరిస్తుందని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ చేసిన వ్యాఖ్యలను బిజెపి సభ్యులు రాజ్యసభలో తీవ్రంగా ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆందోళనకు దిగారు. దీంతో ఇవాళ రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఈ విషయాన్ని సభలో లేవనెత్తగా బిజెపి సభ్యులు కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


కర్నాటక ప్రభుత్వ టెండ‌ర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటువంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కర్నాటక బీజేపీ ఇప్పటికే హెచ్చరించింది. కాగా, క‌ర్నాట‌క ట్రాన్స్‌ప‌రెన్సీ ఇన్ ప‌బ్లిక్ ప్రొక్యూర్మెంట్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ తీసుకువచ్చి, కేట‌గిరీ 2బీ కింద రిజ‌ర్వేష‌న్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు సీఎం సిద్ధరామ‌య్య ప్రక‌టించారు. దీంతో కేటీపీపీ చ‌ట్టం కింద ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రూ. రెండు కోట్ల మేర విలువ కలిగిన ప్రభుత్వ ప‌నులు చేసేందుకు అర్హులవుతారు.


ఇవి కూడా చదవండి:

Stock Market: దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Update: ఈ వారం సైతం మార్కెట్లో బుల్ వీరంగమేనా!

TDP vs YSRCP: వైసీపీకి టీడీపీ సరికొత్త సవాల్ టార్గెట్ అదేనా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 24 , 2025 | 02:27 PM