Home » Karnataka BJP
కర్ణాకట మాజీ సీఎం యడియూరప్ప భార్య మృతి వెనుక కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె హస్తం ఉందని మంత్రి బైరతి సురేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ పట్ల అవమానం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని, ముఖ్యమంత్రి రాజీనామా చేసేదాకా ఆందోళనలు విరమించేది లేదని పరిషత్ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) పేర్కొన్నారు.
‘నోటీసులకు భయపడను.. తప్పు చేసి ఉంటే కదా వెనుకాడాల్సింది..? వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
కర్ణాటకలో కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్(NWC) గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టిన ఘటన కన్నడనాట రాజకీయ దుమారం రేపింది. హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను కర్ణాటక బీజేపీ(BJP) సోషల్ మీడియా షేర్ చేసింది..
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తే లేదని..
ఆంద్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అధికారమని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సీటీ రవి స్పష్టం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తమ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. మరోవైపు కొందరు నేతలు పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు.