Share News

BJP Eid Kits: 'సౌగత్-ఏ-మోదీ' పేరుతో ముస్లింలకు బీజేపీ ఈద్ కిట్లు

ABN , Publish Date - Mar 25 , 2025 | 09:05 PM

బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, 'సౌగత్-ఏ-మోదీ' ముస్లింల సంక్షేమానికి చేపట్టమని విశిష్ట కార్యక్రమమని, పేద ముస్లిం కుటుంబాలకు ఈద్‌ను ఆనందంగా జరుపుకునేందుకు వీలుకల్పిస్తుందని చెప్పారు.

BJP Eid Kits: 'సౌగత్-ఏ-మోదీ' పేరుతో ముస్లింలకు బీజేపీ ఈద్ కిట్లు

న్యూఢిల్లీ: రంజాన్ మాసం సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) వినూత్న కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు చేరువయ్యేందుకు ''సౌగత్-ఏ-మోదీ'' (Saugat-e-Modi) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 32 లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ ప్రత్యేక కిట్లు అందజేయనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సౌత్ఈస్ట్ డిల్లీలోని నిజాముద్దీన్ నుంచి మంగళవారంనాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Kunal Kamra: మరో వీడియో విడుదల చేసిన కునాల్ కామ్రా


ఈ ప్రత్యేక కిట్‌లో ముస్లిం మహిళలు, పురుషులకు దుస్తులతో పాటు, సేమియా, డ్రైఫ్రూట్స్, ఖర్జూరం, చక్కెర వంటి ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఒక్కో కిట్ ధర రూ.500 నుంచి 600 వరకూ ఉంటుంది. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, 'సౌగత్-ఏ-మోదీ' ముస్లింల సంక్షేమానికి చేపట్టమని విశిష్ట కార్యక్రమమని, పేద ముస్లిం కుటుంబాలకు ఈద్‌ను ఆనందంగా జరుపుకునేందుకు వీలుకల్పిస్తుందని చెప్పారు. ఈద్‌కు మాత్రమే కాకుండా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 140 కోట్ల మంది భారతీయులకు తాను సంరక్షకుడనని ప్రధాని మోదీ ప్రతిసారి చెబుతుంటారని, అందుకు అనుగుణంగానే ఆయన అన్ని పండుగల్లోనూ పాల్గొంటూ ఉంటారని చెప్పారు. క్రిస్టమస్, ఈస్టర్ వంటి పండుగల్లో పాల్గొనడం, అజ్మీర్‌లోని నిజాముద్దీన్ దర్గాకు ఛాదర్ పంపుతుంటారని అన్నారు. ఈద్ పండుగ కానుకగా దేశవ్యాప్తంగా 32 లక్షల మంది నిరుపేద ముస్లింలకు ప్రత్యేక బహుమతులు అందిస్తు్న్నామన్నారు. 32,000 మసీదుల్లో 32,000 బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కిట్లు అందజేస్తారని చెప్పారు.


బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముస్లిం సమాజంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ఆ వర్గాలతో సంబంధాలను మరింత బలపరుచుకోవాలని బీజేపీ ఆలోచనగా ఉంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్-ఆర్జేడీ-ఇతర పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ 110 సీట్లు గెలుచుకుంది.


ఇవి కూడా చదవండి..

Justice Varma Cash Row: జస్టిస్ వర్మ అంశంపై రాజ్యసభ చైర్మన్ అఖిలపక్ష సమావేశం

Delhi Budget 2025: లక్ష కోట్లతో చారిత్రక బడ్జెట్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

High Court: దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

Read Latest and National News

Updated Date - Mar 25 , 2025 | 09:09 PM