Viral Video: అందరూ చూస్తుండగా భర్తను చావగొట్టిన లేడీ బాక్సర్
ABN , Publish Date - Mar 25 , 2025 | 07:05 PM
ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. వారిని ఓ గదిలో కూర్చోబెట్టారు. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భార్యకు కోపం వచ్చింది. భర్తపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ మాజీ లేడీ బాక్సర్ అందరూ చూస్తుండగా.. అది కూడా కుటుంబసభ్యుల ముందు భర్తను చావగొట్టింది. అది కూడా పోలీస్ స్టేషన్‌లో భర్తపై దాడికి దిగింది. ఆ భర్త ఎవరో ఆశామాషీ వ్యక్తి కాదు.. దేశంలోనే పేరున్న కబడ్డీ ప్లేయర్. భార్యాభర్తలిద్దరూ దేశం గర్వించదగ్గ స్పోర్ట్స్ పర్సన్స్. ఇంతకీ ఎవరు వాళ్లు?.. ఎందుకిలా పోలీస్ స్టేషన్లో గొడవ పడాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ సవితీ బోరా.. హర్యానాకు చెందిన కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడా 2022లో పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ళ పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం దీపక్ తనను వేధిస్తున్నాడంటూ సవితీ బోరా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది.
కోటి రూపాయల కోసం దీపక్ తనను ప్రతీరోజు కొడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఓ లగ్జరీ కారు కావాలని వేధిస్తే.. కొనిచ్చామని అంది. దీపక్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన ఎంక్వైరీ కోసం కొద్దిరోజుల క్రితమే దీపక్, సవతి ఫ్యామిలీలు స్టేషన్‌కు వెళ్లాయి. అక్కడి ఓ ప్రైవేట్ రూములో ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దీపక్, సవతిల మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సవతి.. దీపక్ మీదకు ఉరికింది. అతడి గొంతు పట్టుకుంది. తర్వాత ఇష్టం వచ్చినట్లు కొట్టింది. కుటుంబసభ్యులు కలిగించుకుని ఆమెను పక్కకు తీసుకు వచ్చారు. అయినా ఆమె కోపం చల్లారలేదు. అతడిపై మాటలతో రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు లేడీ బాక్సర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ కాలంలో కూడా అదనపు కట్నం కోసం వేధించటం ఏంటంటూ.. దీపక్‌పై మండిపడుతున్నారు. ఇలాంటి వారికి జైలు శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, దీపక్ హుడా ఇండియన్ కబడ్డీ టీంలో సభ్యుడిగా ఉన్నాడు. 2016లో సౌత్ ఏషియన్ ఏషియన్ గేమ్స్‌లో.. 2014లో ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన టీంలోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. కబడ్డీ నుంచి రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.
ఇవి కూడా చదవండి:
Ranya Rao: రన్యారావు కేసు మరో మలుపు.. హవాలా సొమ్ముతో బంగారం కొనుగోలు
IPL 2025: అవేశ్ ఖాన్‌కు ఫిట్ సర్టిఫికేట్.. లక్నో క్యాంప్‌లో చేరేందుకు సిద్ధం
GT vs PBKS IPL 2025 Live Updates: గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లో టాస్ ముందు బిగ్ ట్విస్ట్