Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
ABN , Publish Date - Apr 19 , 2025 | 07:52 AM
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నగరంలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి నలుగురు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కుప్పకూలి నలుగురు మృతి చెందారు. ఈ విషాదకరమైన సంఘటన ఢిల్లీ నగరంలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నేడు తెల్లవారుజామున ముస్తఫాబాద్ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
శిథిలాల కింద చాలా మంది కార్మికులు చిక్కుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే భవనం కుప్పకూలిందని స్థానికులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఢిల్లిలో గత వారం కూడా మధు విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై స్ధానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలు ఎందుకు కూలిపోతున్నాయి. క్వాలిటి లేకుండా భవనాలను నిర్మిస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతుంది.
Also Read:
MK Stalin: ఎప్పటికీ ఢిల్లీకి తలొగ్గే ప్రసక్తి లేదు: స్టాలిన్
Satellite Based Toll: మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై కేంద్రం క్లారిటీ