Share News

Sheikh Hasina : హసీనా వీసా గడువును పొడిగించిన కేంద్రం

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:48 AM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం కోరుతుండగా.. మరోవైపు ఆమె పాస్‌పోర్టును కూడా రద్దు చేసిన వేళ...

Sheikh Hasina : హసీనా వీసా గడువును పొడిగించిన కేంద్రం

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం కోరుతుండగా.. మరోవైపు ఆమె పాస్‌పోర్టును కూడా రద్దు చేసిన వేళ... భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరికొంత కాలం ఉండేందుకు వీలుగా హసీనా వీసా గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. స్థానిక ఫారినర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి వచ్చిన అభ్యర్థనను పరిశీలించిన అనంతరం.. కేంద్ర హోంశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి.

Updated Date - Jan 09 , 2025 | 05:48 AM