OTT platforms: నైతిక విలువలు పాటించండి
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:39 AM
ఐటీ చట్టం నిషేధించిన కంటెంట్ ప్రసారానికి వ్యతిరేకంగా విప్ జారీ చేసింది. కంటెంట్ ప్రసారంలో ఐటీ నిబంధనలు-2021లో పేర్కొన్న నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది.
ఎ’ రేటెడ్ కంటెంట్ చిన్నారులకు అందుబాటులో ఉండొద్దు
ఓటీటీలు, సోషల్ మీడియా వేదికలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: సోషల్ మీడియా వేదికలపై అశ్లీల జోకుల ప్రసారంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఓటీటీ వేదికలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ చట్టం నిషేధించిన కంటెంట్ ప్రసారానికి వ్యతిరేకంగా విప్ జారీ చేసింది. కంటెంట్ ప్రసారంలో ఐటీ నిబంధనలు-2021లో పేర్కొన్న నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓటీటీ వేదికలకు, స్వయం నియంత్రిత సంస్థలకు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల మంత్రిత్వశాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఆయా వేదికలపై నైతిక విలువల ఉల్లంఘనపై తగిన చర్యలు చేపట్టాలని ఓటీటీ వేదికల స్వయం నియంత్రిత సంస్థలను ఆదేశించింది. ఓటీటీ వేదికలపైనా, సోషల్ మీడియాలోనూ అశ్లీలత, పోర్నోగ్రఫిక్, వల్గర్ అంశాలు పెచ్చరిల్లుతున్నాయంటూ పార్లమెంటు సభ్యులు, చట్టబద్ధ సంస్థ లు, ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు అందాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఓటీటీ వేదికలపై ఏదే ని అంశాన్ని ప్రచురించే సమయంలో చట్టంలోని వివిధ నిబంధనల కింద పేర్కొన్న నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని కోరుతూ ఈ అడ్వైజరీని జారీ చేస్తున్నామని పేర్కొంది. ‘ఎ’ రేటెడ్ కంటెంట్ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది.
యూట్యూబ్‌లో సమయ్ రైనా నిర్వహిస్తున్న ‘ఇండియాస్ గాట్ లాటెంట్(ఐజీఎల్)’ కార్యక్రమంలో యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో రణవీర్‌పై కేసులు కూడా నమోదవగా, ఆ కేసులన్నింటినీ కలిపి విచారించాలంటూ సుప్రీంకోర్టులో రణవీర్ పిటిషన్ దాఖలు చే శారు. పిటిషన్ విచారణ సందర్భంగా రణవీర్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో నైతిక విలువలు పాటించాలంటూ కేంద్రం తాజాగా ఓటీటీ వేదికలకు హెచ్చరిక జారీ చేసింది.