Pranab Mukherjee: ఢిల్లీలో ప్రణబ్ స్మారక స్థూపం
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:09 AM
దివంగత రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ స్మారక స్థూపాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ, జనవరి 7: దివంగత రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ స్మారక స్థూపాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌ఘాట్ కాంప్లెక్స్ పరిధిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో దీన్ని నెలకొల్పనుంది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ కేంద్ర గృహనిర్మాణ-పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తనకు లేఖ పంపారని ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ తెలిపారు. అనూహ్యంగా ఈ కృప లభించిందని పేర్కొంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ప్రణబ్ చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కాలేదంటూ ఇటీవల శర్మిష్ఠ విమర్శలు చేయడం గమనార్హం.