Share News

ISRO : చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌పై దృష్టి

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:50 AM

ఇస్రో ప్రస్తుతం విజయపథంలో దూసుకెళ్తోందని ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రోకు నూతన చైర్మన్‌గా ఎంపికైన వి నారాయణన్‌ అన్నారు. ఇప్పుడు ఇస్రో ముందున్న

ISRO : చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌పై దృష్టి

ఇస్రో కొత్త చైర్మన్‌ నారాయణన్‌..14న బాధ్యతలు

సూళ్లూరుపేట, బెంగళూరు (ఆంధ్రజ్యోతి), జనవరి 8: ఇస్రో ప్రస్తుతం విజయపథంలో దూసుకెళ్తోందని ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రోకు నూతన చైర్మన్‌గా ఎంపికైన వి నారాయణన్‌ అన్నారు. ఇప్పుడు ఇస్రో ముందున్న ప్రధాన మిషన్లలో చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌ ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, ఇస్రో చైర్మన్‌గా తాను చేపట్టనున్న కొత్త బాధ్యతల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ పదవీకాలం ఈ నెల 13న ముగియనుంది. ఈ నెల 14న సోమనాథ్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. త్వరలో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి నారాయణన్‌ మాట్లాడుతూ.. ‘ఇస్రో ముందున్న కీలక మిషన్లు గగన్‌యాన్‌, చంద్రయాన్‌-4. అలాగే శ్రీహరికోట నుంచి ఈ నెలాఖరులో నావిగేషన్‌ కోసం ఎన్‌వీఎస్‌02 ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 05:50 AM