Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:00 AM
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలను ఒక్క చోటకు చేర్చి కాషాయ పార్టీపై కదం తొక్కేందుకు సమాయత్తమవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

ఏఐసీసీ సమావేశాల్లో కార్యాచరణ.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో కీలక భేటీలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఖర్గే అధ్యక్షతన నిర్వహణ
హాజరవ్వనున్న సోనియా, రాహుల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు కాంగ్రెస్ పదును పెడుతోంది. ఏప్రిల్‌లో జరగనున్న ఏఐసీసీ కీలక సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలను ఒక్క చోటకు చేర్చి కాషాయ పార్టీపై కదం తొక్కేందుకు సమాయత్తమవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లు, రాజ్యాంగం, దాని విలువలపై ఆ పార్టీ చేస్తున్న దాడులను ఎదుర్కొనే వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించింది.
గతేడాది డిసెంబరులో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహ భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఏప్రిల్ 8న సీడబ్ల్యూసీ సమావేశం.. 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు. ఈ భేటీలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షత వహిస్తారని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ కార్యాలయ ఆఫీస్ బేరర్లు, ఏఐసీసీ ప్రతినిధులు, సీనియర్ నేతలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.