Abujhmad: అబూజ్‌మడ్‌లో నలుగురు నక్సల్స్ హతం
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:36 AM
అబూజ్‌మడ్ మరోమారు నెత్తురోడింది. భద్రతాబలగాలు-మావోయిస్టులకు మధ్య శనివారం అర్ధరాత్రి నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో.. ఇద్దరు మహిళలు సహా నలుగురు నక్సల్స్, డీఆర్జీకి చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందారు.
చర్ల, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అబూజ్‌మడ్ మరోమారు నెత్తురోడింది. భద్రతాబలగాలు-మావోయిస్టులకు మధ్య శనివారం అర్ధరాత్రి నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో.. ఇద్దరు మహిళలు సహా నలుగురు నక్సల్స్, డీఆర్జీకి చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందారు. ఆదివారం ఉదయం జరిపిన గాలింపులో..నలుగురు నక్సల్స్ మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.