Share News

Fake videos : ఈ ఫేక్‌ వీడియోలను నమ్మకండి

ABN , Publish Date - Feb 21 , 2025 | 06:08 AM

ఈ నెలలో ప్రతి ఒక్కరూ రూ.21 వేలు చెల్లించి ఖాతా ఓపెన్‌ చెయ్యండి. మరుసటి రోజు మీ ఖాతాలో రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు జమవుతాయి.

Fake videos : ఈ ఫేక్‌ వీడియోలను నమ్మకండి

‘‘భారత ప్రభుత్వంతో గూగుల్‌ ఒక చరిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రతి భారతీయ పౌరుడిని మిలియనీర్‌ను చేస్తాం. రూ.21 వేలు ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. మీ ఖాతాలో డబ్బు పెరగకపోతే నన్నడగండి’’

- ఇదీ గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ చెప్పినట్టు వైరల్‌ అవుతున్న వీడియో

‘‘నెలలో ప్రతి ఒక్కరూ రూ.21 వేలు చెల్లించి ఖాతా ఓపెన్‌ చెయ్యండి. మరుసటి రోజు మీ ఖాతాలో రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు జమవుతాయి. మీ డబ్బుకు నేను గ్యారెంటీ. ప్రతి గంటకు రూ.2 వేలు వడ్డీ వస్తుంది’’

- ఇదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్టు వైరల్‌ అవుతున్న వీడియో

Untitled-2 copy.jpg

‘‘రిలయన్స్‌ తరఫున ఒక గొప్ప ప్రాజెక్ట్‌ చేపట్టాం. రూ.21 వేలు పెట్టుబడి పెడితే చాలు.. మీ ఖాతాలో నెల తిరిగేసరికి రూ.40 లక్షలు వచ్చిపడతాయి. దీనికి నేను గ్యారెంటీ. ఇది మోసమని ఎవరైనా చెబితే వారి మాటలు నమ్మకండి’

’- ఇదీ ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చెప్పినట్టు వైరల్‌ అవుతున్న వీడియో

Untitled-2 copy.jpg

Updated Date - Feb 21 , 2025 | 06:08 AM