Share News

IMD: నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

ABN , Publish Date - Mar 25 , 2025 | 07:10 AM

మరో నాలుగు రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని, ప్రజలందరూ మధ్యాహ్న సమయంలో ఇంటివద్దే ఉండండని వాతావరణ శాఖ సూచించింది. ఈమేరకు వాతావణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

IMD: నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

- ఐఎండీ హెచ్చరిక

చెన్నై: రాష్ట్రమంతటా రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై సహా ప్రధాన నగరాల్లో ఉదయం 9 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. ఇప్పటికే ఈ యేడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో విపరీతంగా ఎండలు ఉంటాయని, వృద్ధులు, చిన్నారులు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఇంటిపట్టునే ఉండడం మంచిందని సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: Delhi High Court: జస్టిస్‌ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే


రాష్ట్రంలోని వేలూరు, నామక్కల్‌, కరూరు, తిరుచ్చి(Vellore, Namakkal, Karur, Trichy) జిల్లాల్లో సాధారణ స్థాయికంటే అధికంగా ఎండలు కాస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో నాలుగు రోజులపాటు పగటిపూట వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు ఇక ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు ఇంటి నుండి బయలుదేరేటప్పుడే గొడుగులు, టోపీ వెంట తీసుకెళ్లడం మంచిదని తెలిపారు.


nani1.2.jpg

కార్యాలయాల్లో, ఇళ్లలోనూ ఫ్రిజ్‌లో చల్లబరచిన నీటిని తాగకూడదని, మట్టికుండలోని నీళ్లను తాగటం శ్రేయస్కరమని చెబుతున్నారు. రైళ్లలో, బస్సులలో ప్రయాణించేవారు స్టీలు, అల్యూమినియం వాటర్‌బాటిళ్లలో నీటిని వెంట తీసుకెళ్ళాలని తెలిపారు. తరచూ నిమ్మరసం తాగాలని, ఆపిల్‌, జామ, సపోటా, అరటి తదితర పండ్లను అధికంగా తింటే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చునని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం

ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

న్యాయవాది దారుణ హత్య

పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2025 | 07:10 AM