Share News

Domestic abuse: భార్య వేధింపులు భరించలేక గుజరాత్‌లో భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:42 AM

భార్య వేధింపులు భరించలేక మరో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బెంగళూరులో ఇలాంటి సంఘటన జరగగా, తాజాగా గుజరాత్‌లో చోటుచేసుకుంది.

Domestic abuse: భార్య వేధింపులు భరించలేక గుజరాత్‌లో భర్త ఆత్మహత్య

రాజ్‌కోట్‌, జనవరి 5: భార్య వేధింపులు భరించలేక మరో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బెంగళూరులో ఇలాంటి సంఘటన జరగగా, తాజాగా గుజరాత్‌లో చోటుచేసుకుంది. బోటాడ్‌ జిల్లా జమరాల గ్రామానికి చెందిన సురేష్‌ సతాదియా (39) గత నెల 30న తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాలు తీసుకునే ముందు సెల్‌ఫోన్‌ ద్వారా అతడు తీసిన వీడియో వెలుగులోకి రావడంతో ఆయన తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య జయ తనను మానసికంగా హింసించిందని సురేశ్‌ ఆ వీడియోలో తెలిపాడు. ‘‘జీవితాంతం గుర్తుంచుకునేలా ఆమెకు గుణపాఠం చెప్పండి. ఆమె నాకు చెందదు. పిల్లలకు కూడా చెందదు. నన్ను మోసగించింది. ప్రాణాలు తీసుకునేలా చేసింది’’ అని సురేష్‌ చెప్పాడు. తనతో నిత్యం గొడవ పడి పుట్టినింటికి వెళ్లిపోయేదని తెలిపాడు. సురే్‌షకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 15, 10 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు, 6, 4 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, సురేశ్‌ భార్యను శనివారం అరెస్టు చేశామని డీఎస్పీ ఎన్‌.పి.అహిర్‌ తెలిపారు.

Updated Date - Jan 06 , 2025 | 04:42 AM