Bengaluru: రచ్చకెక్కిన దంపతుల వివాదం.. భార్య వేధిస్తోందని భర్త ఫిర్యాదు
ABN , Publish Date - Mar 20 , 2025 | 08:51 AM
ఇంట్లో నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన భార్యాభర్తల పంచాయతీలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా ఓ భర్త తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏకంగా పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- వారే ఇబ్బంది పెట్టారంటూ ఆమె వివరణ
బెంగళూరు: ఇటీవల కాలంలో భార్యల వేధింపుల వివాదాలు హల్‌చల్ చేస్తున్నాయి. బెంగళూరు(Bengaluru)కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంసారం చేసేందుకు రోజుకు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, భార్య తరపు బంధువులు ఇల్లు కొనాలని డబ్బు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విడాకులు కోరితే రూ.45లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నానని ఇప్పటివరకు సంసారం చేయలేదని, అందం పాడవుతుందని పిల్లలు వద్దని ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: భార్య కన్నింగ్ ప్లాన్.. భర్తను చంపి.. అతడి వాట్సాప్ నుంచి..
సొంత పిల్లలు వద్దని, దత్తత తీసుకుందామని వేధిస్తోందన్నారు. సంసారానికి సిద్ధమైతే డెత్‌నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదరిస్తున్నట్టు ఫిర్యాదులో స్పష్టం చేశారు. వర్క్‌ఫ్రం హోం వేళ టీవీ సౌండ్ పెంచడం, డ్యాన్స్ చేసి ఇబ్బంది పెట్టేదని, వేధింపులు తట్టుకోలేక పోతున్నానని ఉపశమనం కలిగించాలని పోలీసుల ఎదుట వాపోయాడు.
అయితే భార్య కూడా పలు ఆరోపణలు చేశారు. రెండేళ్లక్రితం పెళ్లి చేసుకున్నామని, ఇంట్లో భర్తతోపాటు బంధువులు ఇబ్బంది పెట్టేవారన్నారు. సంసారానికి అభ్యంతరం చెప్పలేదని అన్నీ అబద్ధాల వీడియోలు విడుదల చేశారన్నారు. మా తండ్రి రూ.40లక్షలు ఇచ్చి పెళ్లి చేశారన్నారు. కనీసం భోజనం కూడా పెట్టడం లేదని, అందుకే తరచూ పుట్టింటికి వెళ్లి వస్తున్నట్టు తెలిపారు. తీరు మార్చుకుంటే కలసి ఉంటానని చెప్పానన్నారు. గతంలోనే వయ్యాలికావల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదన్నారు. వారికి ఖర్చు కాకూడదని ఇంటిల్లిపాదికి అరలీటరు పాలు మించరాదని, అన్నం విషయంలోనూ రాద్ధాంతం చేసేవారని ఓ ఫొటోను ఆమె విడుదల చేశారు. భార్యాభర్తల వివాదం రచ్చకెక్కింది.
ఈ వార్తలు కూడా చదవండి:
RTC bus: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
Sunita Williams: క్షేమంగా పుడమికి
Retirement Age: రిటైర్‌మెంట్ ఏజ్‌పై కేంద్రం కీలక ప్రకటన..