Share News

Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా

ABN , Publish Date - Feb 18 , 2025 | 11:41 AM

భూగర్భ జలాలు పడిపోతున్న వేళ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. తాగు నీటిని ఇతర అవసరాలకు వాడే వారిపై రూ.5 వేల జరిమానా విధిస్తామని తాజాగా ప్రకటించింది.

Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా

ఇంటర్నెట్ డెస్క్: గత ఏడాది ఎండాకాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్న బెంగళూరు (Bengaluru) నగరం ఈసారి ముందస్తుగా జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ఎండాకాలం మొదలు కానున్న నేపథ్యంలో నీటి పొదుపు చర్యలకు దిగింది. నగరపాలక సంస్థ సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని తాజాగా పేర్కొంది. పదే పదే ఇలా చేసే వారికి అదనపు వడ్డింపులు కూడా ఉంటాయని హెచ్చరించింది. నగరంలో భూగర్భ జనాలు వేగంగా పడిపోతున్నాయని వెల్లడించింది. రాబోయే రోజుల్లో నగరంలో నీటి కొరత ఏర్పడుతుందని ఐఐఎస్‌సీ సంస్థ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.


Chief Election Commissioner: కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌

‘‘వాహనాలు కడగడం, తోటల్లో మొక్కలకు నీళ్లు, నిర్మాణావసరాలు, డెరకేటివ్ ఫౌంటెయిన్‌లు, సినిమా హాళ్లు మాల్స్, రోడ్లు నిర్మాణం, ఇతర అవసరాలకు తాగునీటిని వినియోగించడంపై బెంగళూరు నగరంలో నిషేధం విధిస్తున్నాము. ఈ నిబంధనను అతిక్రమించిన వారికి వాటర్ బోర్డు యాక్ట్‌లోని సెక్షన్ 109 ప్రకారం రూ.5 వేల జరిమానా విధిస్తాము. పదే పదే ఈ ఉల్లంఘనకు పాల్పడే వారిపై రూ.5 వేల జరిమానాతో పాటు అదనంగా మరో రూ500 ఫైన్ విధిస్తాము’’ అని ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని కూడా పేర్కొంది.


Air Ambulances: రోడ్డుపై టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యే ఎయిర్‌ అంబులెన్స్‌

ఇక బెంగళూరులో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు చేరింది. గేడాది వర్షాలు లేక ఎండాకాలంలో బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. నగరంలో 14 వేల బోర్ వెల్స్‌లో దాదాపు సగం ఎండిపోయాయి. రోజుకు సగటున 300 నుంచి 500 మిలియన్ లీటర్ల నీటికి కొరత ఏర్పడింది. నగర అవసరాలకు రోజుకు 1450 మిలియన్ లీటర్ల నీరు కావాలి. ఇందులో సగానికి పైగా కావేరీ నది నుంచి సమకూరుతుండగా మిగిలిన మొత్తం భూగర్భ జలాలా ద్వారా అందుతోంది.

Railway Safety: తొక్కిసలాటల నివారణకు.. 60 రైల్వేస్టేషన్లలో హోల్డింగ్‌ జోన్లు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 11:41 AM