Share News

Tulasi Gabbard: ఇస్లామిక్ తీవ్రవాదంతో భారత్-అమెరికాకు ముప్పు.. యూఎస్ ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్

ABN , Publish Date - Mar 17 , 2025 | 06:56 PM

ఇస్లామిట్ టెర్రరిజం ముప్పు ప్రభావం ఇటు భారత్‌, అటు ఆమెరికాతో పాటు మధ్యప్రాశ్యంలోని పలు దేశాలపై ఉందని, ఉగ్రవాదం పీచమణిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు కలసికట్టుగా పనిచేస్తున్నారని తులసీ గబ్బర్డ్ చెప్పారు.

Tulasi Gabbard: ఇస్లామిక్ తీవ్రవాదంతో భారత్-అమెరికాకు ముప్పు.. యూఎస్ ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్

న్యూఢిల్లీ: భారత్‌పై పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తున్న దాడులను ''ఇస్లామిక్ టెర్రరిజం" (Islamist terrorism)గా యూఎస్ ఇంటెల్ చీప్ తులసీ గబ్బర్డ్ (Tulasi Gabbard) అభివర్ణించారు. ఇస్లామిట్ టెర్రరిజం ముప్పు ప్రభావం ఇటు భారత్‌, అటు ఆమెరికాతో పాటు మధ్యప్రాశ్యంలోని పలు దేశాలపై ఉందని, ఉగ్రవాదం పీచమణిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు కలసికట్టుగా పనిచేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి వచ్చి తులసీ గబ్బర్డ్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను సోమవారం ఉదయం కలుసుకున్నారు.

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్ భేటీ


"దురదృష్టవశాత్తూ మనకు ఇస్లామిక్ టెర్రరిజం ఒక ప్లేగులా తయారైంది. అమెరికా ప్రజలకు ఈ ముప్పు కొనసాగుతోంది. ఈ ముప్పును సమష్టిగా తిప్పికొట్టేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కట్టుబడి ఉంది. ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రభావం ఇండియాలోనూ, బంగ్లాదేశ్‌లోనూ మనం చూశాం. ప్రస్తుతం సిరియా, ఇజ్రాయెల్, మధ్యప్రాశ్చంలోని పలు దేశాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌గా తీసుకున్నారనే విషయం నాకు తెలుసు. ఉగ్రవాదాన్ని గుర్తించి, దాని ఆట కట్టించేందుకు నేతలంతా సమష్టిగా పనిచేస్తు్న్నారు" అని మీడియాతో మాట్లాడుతూ గబ్బర్డ్ అన్నారు.


కాగా, అమెరికాలో ఖలిస్థాన్ ఆర్గనైజేషన్ ఎస్‌జేఎస్ (సిక్ ఫర్ జస్టిస్) భారత ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుండటాన్ని గబ్బర్డ్‌తో సమావేశంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చట్టవిరుద్ధమైన ఎస్‌జేఎస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది.


ఇవి కూడా చదవండి..

Ranya Rao: నవంబర్‌లో పెళ్లి, నెల తర్వాత విడివిడిగా.. రన్యారావు భర్త వెల్లడి

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Kharge: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 07:48 PM