ISRO: డాకింగ్‌కు 3 మీటర్లు చేరువగా..
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:12 AM
అంతరిక్షంలో అనుసంధానం కోసం ప్రయోగించిన స్పేడెక్స్ మిషన్‌లో అత్యంత కీలకమైన డాకింగ్ కోసం ఇస్రో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించింది.
ట్రయల్ రన్‌లో ఉపగ్రహాలను దరి చేర్చిన ఇస్రో
బెంగళూరు, జనవరి 12: అంతరిక్షంలో అనుసంధానం కోసం ప్రయోగించిన స్పేడెక్స్ మిషన్‌లో అత్యంత కీలకమైన డాకింగ్ కోసం ఇస్రో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించింది. ట్రయల్ రన్‌లో భాగంగా వాటి మధ్య దూరాన్ని 3 మీటర్లకు తగ్గిం చి.. అనంతరం వెనక్కు తరలించినట్టు ఇస్రో ఆదివారం వెల్లడించింది. ‘‘ట్రయల్‌లో భాగంగా ఉపగ్రహాల మధ్య దూరాన్ని 3 మీటర్లకు తీసుకొచ్చాం. ఆ తర్వాత ఉపగ్రహాన్ని సురక్షిత దూరానికి తరలిం చాం. ఈ డేటాను మరింత విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియ చేపడతాం’’ అని ఇస్రో ఎక్స్‌లో పేర్కొంది. ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ద్వారా గత నెల 30న ఇస్రో భూకక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.