Share News

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Mar 14 , 2025 | 03:21 PM

పాకిస్థాన్‌లో టెర్రరిజాన్ని ఇండియా ప్రోత్సహిస్తోందని, అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ఘటనలో ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను కాంట్రాక్ట్ చేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి అలిఖాన్ అన్నారు. భరత్ పొరుగుదేశాలను అస్థిర పరచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందంటూ ఆదేశం చేసిన ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు. ''ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో యావత్ ప్రపంచానికి తెలుసు. ఇతరుల వైపు వేలెత్తి చూపించే ముందు తమ అంతర్గత సమస్యలపై ఆ దేశం దృష్టిసారిస్తే బాగుంటుంది'' అని పాక్‌కు ఘాటు సమాధానమిచ్చారు.

Ranya Rao: యూట్యూబ్‌లో చూసి స్మగ్లింగ్‌ నేర్చుకున్నా


దీనికి ముందు, రైలు హైజాక్ వెనుక ఆప్ఘనిస్థాన్ హస్తం ఉందని తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్టు పాక్ విదేశాంగ ప్రతినిధి షౌకత్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నిస్తూ, గతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏ అఘాయిత్యానికి పాల్పడినా భారత్ వైపు చూపించేందని, ఇప్పుడు పాక్ విదేశాంగ విధానంలో ఏదైనా మార్పు ఉంటుందా అని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి షౌకత్ అలీ ఖాన్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు ''మా విధానంలో ఎలాంటి మార్పు లేదు" అని ఆయన స్పష్టం చేశారు. భారత్ మీడియా ఒకరకంగా బీఎల్‌ను కీర్తిస్తోందని, అది అధికారికంగా కాకపోయినా ఆ దేశ విదేశాంగ విదానాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.


పాకిస్థాన్‌లో టెర్రరిజాన్ని ఇండియా ప్రోత్సహిస్తోందని, అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ఘటనలో ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను కాంట్రాక్ట్ చేశారని అలిఖాన్ అన్నారు. భారత్ పొరుగుదేశాలను అస్థిర పరచేందుకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణ చేశారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ వేర్పాటువాదులు హైజాక్ చేసి పలువురు ప్రయాణికులను బందీలుగా పట్టుకుంది. బలోచ్ మిలిటెంట్లను 33 మందిని హతమార్చినట్టు పాక్ ఆర్మీ ప్రకటించుకుంది. అయితే, ఇందుకు సంబంధించిన ఫోటోలను కానీ, ఆపరేషన్ సక్సె్స్ అయిందా లేదా అనే దానిని గానీ ఇంతవరకూ నిర్ధారించలేదు.


Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2025 | 03:28 PM