Home » Islamabad
పాక్ ఆర్మీతో కానీ, ఐఎస్ఐఎస్తో కానీ రాణాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం బహిరంగ రహస్యమేనని, అయితే ముంబై దాడుల్లో పాక్ ప్రమేయం ఉందంటూ తమదేశంపై ఎలాంటి విష బీజాలు నాటుతాడోనని తాము భయపడుతున్నామని విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్‌ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది.
పాకిస్థాన్‌లో టెర్రరిజాన్ని ఇండియా ప్రోత్సహిస్తోందని, అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ఘటనలో ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను కాంట్రాక్ట్ చేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి అలిఖాన్ అన్నారు. భరత్ పొరుగుదేశాలను అస్థిర పరచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పాక్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన నిశ్చితాభిప్రాయమని ఇమ్రాన్ చెప్పారు. అయితే మానవ హక్కుల విషయాన్నికి వచ్చినప్పుడు సహజంగానే అంతర్జాతీయ సంస్థలు గళం విప్పుతాయని, ఈ లక్ష్యం కోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చెప్పారు.
జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది అయిన మక్కీకి 2002లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కారణంగా యాంటీ-టెర్రరిజం కోర్టు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో జైలుశిక్ష పడిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రచారంలో లేరు.
ఆర్మీ కథనం ప్రకారం, మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడియత్నం చేశారు. చెక్‌పోస్ట్‌లోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది.
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా.. 25వ రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
జైశంకర్‌కు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్థాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దిగజారిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.
ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రొటేటింగ్ చైర్మన్షిప్ ఈసారి పాకిస్థాన్‌కు వచ్చింది. శిఖరాగ్ర సమావేశానికి ముందు మంత్రి వర్గ సమావేశం, ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంస్కృతి, మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.
పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు జకీర్ నాయక్ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం చేరుకున్నారు.