Share News

Jagdeep Singh: ఒక్క రోజు వేతనం.. 48 కోట్లు!

ABN , Publish Date - Jan 06 , 2025 | 05:16 AM

రూ.48 కోట్లు. ఇది ఒక కంపెనీ నెలవారీ టర్నోవర్‌ కాదు. ఒక వ్యక్తి ఒక్క రోజులో సంపాదించే మొత్తం. ఆయన పేరు జగదీప్‌ సింగ్‌. విద్యుత్తు వాహనాల్లో వినియోగించే బ్యాటరీల తయారీ రంగంలో ఉన్న క్వాంటమ్‌స్కేప్‌ సీఈవో ఇతను. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా జగదీ్‌పసింగ్‌ రికార్డు సృష్టించారు.

Jagdeep Singh: ఒక్క రోజు వేతనం.. 48 కోట్లు!

ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న

వ్యక్తిగా క్వాంటమ్‌స్కేప్‌ సీఈవో జగదీప్‌ సింగ్‌ రికార్డు

ఆయన వార్షిక ఆదాయం రూ.17,500 కోట్లు

ఈవీ బ్యాటరీల తయారీలో అగ్రగామిగా క్వాంటమ్‌స్కేప్‌

న్యూఢిల్లీ, జనవరి 5: రూ.48 కోట్లు. ఇది ఒక కంపెనీ నెలవారీ టర్నోవర్‌ కాదు. ఒక వ్యక్తి ఒక్క రోజులో సంపాదించే మొత్తం. ఆయన పేరు జగదీప్‌ సింగ్‌. విద్యుత్తు వాహనాల్లో వినియోగించే బ్యాటరీల తయారీ రంగంలో ఉన్న క్వాంటమ్‌స్కేప్‌ సీఈవో ఇతను. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా జగదీ్‌పసింగ్‌ రికార్డు సృష్టించారు. ఆయన వేతనం రోజుకు 48 కోట్ల రూపాయలు. ఏడాదికి రూ.17,500 కోట్లు. ఇది చాలా పెద్దసంస్థల వార్షిక ఆదాయం కంటే అధికం. 2010లో అమెరికాలో జగదీప్‌ సింగ్‌ స్థాపించిన క్వాంటమ్‌స్కేప్‌... ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీల తయారీలో అగ్రగామిగా ఉంది. భారత సంతతికి చెందిన ఆయన స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో బీటెక్‌, బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. బ్యాటరీ టెక్నాలజీలో తనదైన ముద్ర వేసిన జగదీప్‌ సింగ్‌.. ప్రపంచం దృష్టి ఆకర్షిస్తున్నారని పారిశ్రామిక దిగ్గజాలు ప్రశంసిస్తున్నారు. కళ్లు చెదిరే ఆయన వేతన ప్యాకేజీ వివరాలు వెల్లడి కావడంతో రాత్రికి రాత్రే ఆయన ఇంటర్నెట్‌లో సంచలనంగా మారారు.

Updated Date - Jan 06 , 2025 | 05:16 AM