మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. చిల్లర కోసం..
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:24 PM
95 పైసలకోసం మహిళా జర్నలిస్ట్, క్యాబ్ డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనం మహిళా జర్నలిస్ట్‌పై మండిపడుతున్నారు.

ధనం మూలం ఇదం జగత్.. ఈ ప్రపంచాన్ని మొత్తం డబ్బే శాసిస్తోంది. డబ్బు ఉంటేనే విలువ దొరుకుతోంది. బంధాలు నిలబడాలన్నా కూడా డబ్బులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బుల కోసం జరుగుతున్న నేరాలు, ఘోరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వంద రూపాయల కోసం, 5 రూపాయల కోసం, ఆఖరికి రూపాయి కోసం గొడవలు పడి ప్రాణాలు తీసిన వారు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో కేవలం 95 పైసల కోసం ఓ మహిళా జర్నలిస్ట్, క్యాబ్ డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. చిల్లర పైసల కోసం ఇద్దరూ చాలా సేపు వాదులాడుకున్నారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాలని అనుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన జర్నలిస్ట్ శివంగి శుక్లా డ్యూటీకి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది.
డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్యా గొడవైంది. అది కూడా 95 పైసలకోసం గంట సేపు గొడపడ్డారు. వాళ్లిద్దరి మధ్యా సంభాషణ ఇలా జరిగింది. ‘ మీరు జర్నలిస్ట్ అయితే బిల్లు కట్టారా?’ అని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నించాడు. ‘ మీరు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు’ అని అందామె. అతడు వెంటనే ‘ లేదు.. లేదు.. నేను మీతో ఏం అసభ్యంగా మాట్లాడాను?. పోలీస్ స్టేషన్ లోకేషన్ పెట్టండి. ముందు మీరు డబ్బులు కట్టండి.. అప్పుడే నేను ముందుకు పోనిస్తాను.’ అని అన్నాడు. అప్పుడామె ‘ ముందు పోలీస్ స్టేషన్ పోదాం.. అక్కడ మాట్లాడుకుందాం’ అని అంది. దానికి ఆ డ్రైవర్ ఏ మాత్రం భయపడలేదు. ‘ ముందు మీరు లోకేషన్ ఛేంజ్ చేయండి. అప్పుడే ఇక్కడినుంచి వెళతాను. మీరు జర్నలిస్ట్ అని నన్ను భయపెడుతున్నారా?’ అంటూ మండిపడ్డాడు. దీనికి ఆ మహిళా జర్నలిస్ట్‌కు కోపం వచ్చింది. వెంటనే అతడి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు శిల్పపై మండిపడ్డం మొదలెట్టారు. దీంతో శిల్ఫ ఏం జరిగిందో వివరిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో .. ‘ క్యాబ్ బిల్ రూ. 129.95 ఉంది. నేను తొందరలో ఉండి 95 పైసలు తక్కువగా అతడికి పంపాను. అతడికి చాలా కోపం వచ్చింది. నా మీద అరవటం మొదలెట్టాడు. నేను వీడియో తీయటం మొదలెట్టాక సైలెంట్ అయ్యాడు. 95 పైసల కోసం ఎందుకు అరుస్తున్నావు అని అడిగాను. అప్పుడు కారు స్టార్ట్ చేశాడు. అతడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడేమో అని నేను అనుకున్నాను’ అని అంది. ఈ పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు శిల్పను సపోర్టు చేస్తుంటే.. మరికొంత మంది తిడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి విడుదల
Bank Holidays: ఏప్రిల్ 2025లో బ్యాంక్ సెలవులు ఎన్ని రోజులో తెలుసా..
IPL 2025: ఈడెన్‌లో షారూక్ సందడి.. రేపు చెన్నైలో అనిరుధ్ సంగీత విందుకు సిద్ధమా