ఎంత ఘోరం.. ప్రాణం తీసిన వాట్సాప్ స్టాటస్..
ABN , Publish Date - Mar 24 , 2025 | 09:48 PM
సోషల్ మీడియా బంధాలకు శరాఘాతంలా మారింది. జనాలు కూడా మంచి, చెడుల విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కారణంగా చోటు చేసుకునే దారుణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బంధాల మధ్యలో సోషల్ మీడియా చిచ్చులు పెడుతోంది. లేనిపోని గొడవలకు జనాల్సి పురిగొలుపుతోంది. మనుషులు కూడా విచక్షణ కోల్పోతున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయి తోటి మనుషుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తాజాగా, వాట్సాప్ స్టాటస్ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని కోటలో ఆదివారం చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని సవాయ్ మాదోపూర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల దిల్‌రాజ్ మీనా.. కోటకు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు.
సంవత్సరం క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కోటలోని బాలాజీకి బగీచీలో నివాసం ఉంటున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. ఆదివారం వాట్సాప్ స్టాటస్ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఈ నేపథ్యంలో భార్య మాటలతో దిల్‌రాజ్ మనస్థాపానికి గురయ్యాడు. రైలు కిందపడి చస్తానంటూ ఇంట్లోనుంచి బయటకు పరిగెత్తాడు. భయపడిపోయిన భార్య అతడి వెంట పరుగులు తీసింది. అతడు రైలు ట్రాకు దగ్గరకు చేరుకున్నాడు. అటుగా వస్తున్న రైలు కింద దూకాడు. భార్య ఎంత మొత్తకున్నా వినకుండా ప్రాణాలు తీసుకున్నాడు. అది కూడా భార్య కళ్ల ముందే రైలు కిందపడి ప్రాణం వదిలాడు.
సమాచారం అందుకున్న పోలీసులు దిల్‌రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక, మరో సంఘటనలో ప్రతీ రోజూ నైటీ వేసుకోమంటూ భర్త .. భార్యను వేధించాడు. అతడి వేధింపులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భర్తపై కేసు పెట్టింది. భర్త ప్రతీ విషయంలో తనను డామినేట్ చేస్తూ ఉన్నాడని భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి:
Viral News: ఫేమస్ రెస్టారెంట్ స్టాక్స్ కూప్పకుల్చిన ఎలుక..ఏమైందంటే..
సచిన్, విరాట్ కోహ్లీపై పోలీసు కేసు