Share News

Organ Data Registration: అవయవ మార్పిడి డేటా నమోదు తప్పనిసరి

ABN , Publish Date - Mar 31 , 2025 | 03:39 AM

అవయవ మార్పిడి డేటా ఆస్పత్రులు పంచుకోకపోవడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని ఆస్పత్రులు ఇకపై నేషనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ రిజిస్ట్రీలో డేటాను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. దీనివల్ల పారదర్శకత పెరిగి, సమానమైన అవయవ కేటాయింపులకు దారితీయవచ్చు

Organ Data Registration: అవయవ మార్పిడి డేటా నమోదు తప్పనిసరి

న్యూఢిల్లీ, మార్చి 30: అవయవ మార్పిడికి సంబంధించిన డేటాను ఆస్పత్రులు పంచుకోకపోవడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై వాటిని నేషనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది. దేశవ్యాప్తంగా అనేక రిజిస్టర్డ్‌ ఆస్పత్రులు రోజువారీ, నెలవారీ సమర్పించడంలో విఫలమవుతున్నాయని, తద్వారా పారదర్శకత ఉండటం లేదని ఆ లేఖలో పేర్కొంది. దీనివల్ల అందరికీ సమానంగా అవయవాల కేటాయింపు చేయడానికి ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. వెబ్‌పోర్టల్‌లో ఈ డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని, ప్రక్రియ జరిగిన 48 గంటల్లోనే అవయవ దాతలు, గ్రహీతల వివరాలను రిజిస్ట్రీలో నమోదు చేయాలని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

For National News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 03:39 AM