Share News

Navy Officer: భర్తను చంపి, ప్రియుడితో కలిసి సంబరాలు..

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:58 PM

ముస్కాన్ క్రూరత్వానికి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. భర్తను చంపిన తర్వాత ఆమె తన ప్రియుడితో చేసిన పనులకు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Navy Officer: భర్తను చంపి, ప్రియుడితో కలిసి సంబరాలు..
Navy Officer

మీరట్ మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతడి భార్య ముస్కాన్ ప్రవర్తనతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది. ముస్కాన్ భర్తను చంపిన తర్వాత ప్రియుడితో కలిసి పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేసింది. ముస్కాన్, సాహిల్ శుక్లా హోలీ జరుపుకున్నారు. బర్త్ ‌డే పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో ముస్కాన్.. సాహిల్‌కు కేకు తినిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. కెమెరా ముందు ముస్కాన్ కేకు తినిపిస్తూ ఉంటే.. సాహిల్ నవ్వుతూ ఆ కేకును తిన్నాడు. ఇంతటితో ఆ ఈ జంట ఆగలేదు. మనాలి వెళ్లి మంచులో కూడా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి.


భర్త గుండెల్లో పొడిచి..

సౌరభ్‌ను చంపిన తర్వాత ముస్కాన్, సాహిల్‌లు అతడి శవాన్ని ముక్కలు చేసి, డ్రమ్‌లో పడేశారు. తర్వాత దాన్ని సిమెంట్‌తో కప్పేశారు. పోలీసులు డ్రమ్‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. డాక్టర్లు సిమెంట్‌నుంచి శరీరభాగాలను బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బయటకు తీసిన తర్వాత వాటికి పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ముస్కాన్ క్రూరత్వానికి డాక్టర్లే నివ్వెరపోయారు. నిద్ర మాత్రలు కలిపిన భోజనం చేసిన తర్వాత సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ముస్కాన్ కత్తితో సౌరభ్ గుండెల్లో పొడిచింది. అలా మూడుసార్లు కసిగా భర్త గుండెల్లో పొడిచింది. గుండెలో లోతుగా గాయాలు అయినట్లు తేలింది. సౌరభ్ చనిపోయిన తర్వాత తలను మొండెం నుంచి వేరు చేశారు.


మిగిలిన శరీరాన్ని 15 ముక్కలుగా నరికారు. డ్రమ్‌లో పడేశారు. ఆ డ్రమ్‌ను ఊరికి దూరంగా తీసుకెళ్లి పాడేయాలని అనుకున్నారు. కానీ, కుదరలేదు. సౌరభ్‌ను చంపిన తర్వాత ముస్కాన్ అతడి సెల్‌ఫోన్‌ను వాడింది. అతడి చెల్లెలికి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు చేసింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండడానికి సెల్‌ఫోన్ తీసుకుని ముస్కాన్, సాహిల్ మనాలి వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సౌరభ్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అయితే, సౌరభ్ తల్లిదండ్రులు ఫోన్ చేసినపుడు మాత్రం కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం బయటపడి ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.


ఇవి కూడా చదవండి:

Elevator: ఇలా చేస్తే.. లిఫ్ట్ ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడొచ్చు..

Shashi Tharoor Selfie: శశిథరూర్ సెల్ఫీ కలకలం.. బీజేపీ ఎంపీతో కలిసి జర్నీ

Updated Date - Mar 22 , 2025 | 05:02 PM