Share News

జైల్లో ఉన్న మహిళా ఖైదీని కిస్ చేసిన పోలీస్.. కట్ చేస్తే

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:44 AM

నేవీ అధికారి హత్య కేసులో.. ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకే షాకిచ్చాడు. జైల్లో ఉన్న నిందితురాలు ముస్కాన్‌ని ఓ పోలీసు అధికారి ముద్దు పెట్టుకుంటున్నట్లు ఫేక్ వీడియో క్రియేట్ చేసి వైరల్ చేశాడు. ఆ వివరాలు..

జైల్లో ఉన్న మహిళా ఖైదీని కిస్ చేసిన పోలీస్.. కట్ చేస్తే

లక్నో: మీరట్ నేవీ అధికారి దారుణ హత్య కేసు దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమించిన వాడితో కలిసి భర్తను ముక్కలుగా నరికి.. ఓ డ్రమ్ములో పెట్టి.. విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చింది నిందితురాలు ముస్కాన్ రస్తోగి. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ జైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసులో పోలీసులకు ఊహించని షాకిచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు ఏఐ జెనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశాడు. దీనిలో పోలీసు యూనిఫామ్ ధరించి ఉన్న ఓ వ్యక్తి.. నిందితురాలు ముస్కాన్‌ను ముద్దు పెట్టుకుంటున్నట్లుగా వీడియో క్రియేట్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడం.. పోలీసులపై విమర్శలు రావడం వెంటవెంటనే జరిగాయి. అయితే అది ఫేక్ వీడియో అని గుర్తించిన అధికారులు.. దీన్ని తయారు చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మీద కేసు ఫైల్ చేశారు.


ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారం.. మీరట్ బ్రహ్మపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ ఒకరు ప్రియాన్షురాక్స్_31 అనే ఇన్‌స్టా ఐడీ యూజర్ మీద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాడు. తన పరువు తీయడం కోసమే కావాలనే ఏఐ జనరేటెడ్ వీడియను క్రియేట్ చేసి వైరల్ చేశారని సదరు ఎస్ఐ తన ఫిర్యాదులోపేర్కొన్నాడు. తన ఫేక్ వీడియో క్రియేట్ చేసిన ఇన్‌స్టా యూజర్‌కు సుమారు 75 వేల మంది ఫాలోవర్లు ఉన్నారని అతడి అకౌంట్‌లో ముస్కాన్, ఆమె ప్రియుడికి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వీడియోలు చాలా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా మీరట్ ఎస్‌పీ ఆయుష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని కచ్చితంగా అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.


ముస్కాన్, సాహిల్ ఇద్దరికి స్కూల్ డేస్ నుంచే పరిచయం ఉంది. కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. తిరిగి 2019లో మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర బంధం కొనసాగుతుంది. పైగా ముస్కాన్ భర్త విధుల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండటంతో.. ఆమె ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయసాగింది. చివరకు భర్తను పూర్తిగా అడ్డుతొలగించుకోవాలని భావించి.. అతడిని హత్య చేసింది. ప్రస్తుతం ముస్కన్, ఆమె ప్రియుడు సాహిల్ ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలోఉన్నారు.

ఇవి కూడా చదవండి:

ఇదేం విడ్డూరం.. తల్లికి కాన్పు చేసిన 13 ఏళ్ల బాలుడు..

ఆర్ఆర్‌తో ఓటమికి కారణం అదే.. సీఎస్‌కే కెప్టెన్

Updated Date - Mar 31 , 2025 | 11:57 AM