Share News

నేవీ ఉద్యోగి భార్య దారుణం.. భర్తను చంపి 15 ముక్కలు చేసి..

ABN , Publish Date - Mar 19 , 2025 | 03:21 PM

సౌరభ్ ఇంటికి తిరిగి రావటం ముస్కాన్‌కు నచ్చలేదు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలని భావించింది. తినే తిండిలో నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రపోయిన తర్వాత దారుణానికి పాల్పడింది.

నేవీ ఉద్యోగి భార్య దారుణం.. భర్తను చంపి 15 ముక్కలు చేసి..
Navy Officer

కొన్ని నెలల క్రితం ఓ భర్త తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా కోసిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను ముక్కలు చేసి, కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఇదే కాదు.. దేశ వ్యాప్తంగా జరిగిన చాలా ఘటనల్లో మగవాళ్లు ఆడవాళ్లను చంపి ముక్కలుగా చేస్తూ ఉంటారు. అయితే.. ఫర్ ఏ ఛేంజ్.. ఓ మహిళ తన భర్తను చంపి ముక్కలుగా కోసి పడేసింది. తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. భర్తను చంపిన తర్వాత శవాన్ని ఏకంగా 15 ముక్కలు చేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


ప్రేమ.. పెళ్లి.. మోసం..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్.. అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. సౌరభ్ మర్చంట్ నావీలో పని చేస్తూ ఉండేవాడు. పెళ్లి తర్వాత ఉద్యోగం కారణంగా భార్యతో గడపలేకపోతున్నానని భావించాడు. భార్యకోసం ఉద్యోగం మానేశాడు. ఇక అప్పటినుంచి కుటుంబంలో అలజడి మొదలైంది. ఇంట్లో వాళ్లు మళ్లీ జాబ్‌లో జాయిన్ అవ్వమని గొడవపెడుతూ ఉండేవారు. ఇంట్లో వాళ్ల పోరు భరించలేక భార్యతో కలిసి బయటకు వచ్చేశాడు.


వేరు కాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు. ముస్కాన్.. ఆమె మిత్రుడు సాహిల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలిసింది. దీంతో ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. విడాకుల వరకు విషయం వెళ్లింది. అయితే, కూతురి గురించి ఆలోచించి సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ నావీ ఉద్యోగంలో చేరాలని అనుకున్నాడు. 2023లో ఇండియాను వదలి ఉద్యోగం కోసం వెళ్లిపోయాడు. గత ఫిబ్రవరి 28వ తేదీకి సౌరభ్ కూతురికి ఆరేళ్లు పడ్డాయి. కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఫిబ్రవరి 24వ తేదీన అతడు ఇండియాకు వచ్చాడు. అతడు ఇంటికి తిరిగి రావటం ముస్కాన్, సాహిల్‌కు నచ్చలేదు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. మార్చి 4వ తేదీన అతడు తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపారు. సౌరభ్ భోజనం తిని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ముస్కాన్, సాహిల్ కలిసి కత్తితో అతడ్ని చంపేశారు.


అనంతరం సౌరభ్ శవాన్ని 15 ముక్కలుగా నరికారు. ఆ ముక్కలను ఓ డ్రమ్‌లో పడేసి తడి సిమెంట్‌తో నింపేశారు. ఆ డ్రమ్‌ను వీలైనంత త్వరగా అక్కడినుంచి దూరంగా పడేయాలని అనుకున్నారు. కానీ, అలా చేయటం కుదరలేదు. రోజులు గడుస్తున్నాయి. పొరిగింటి వాళ్లు ముస్కాన్‌ను సౌరభ్ గురించి అడుగుతూ ఉన్నారు. అతడు హిల్ స్టేషన్‌కు వెళ్లాడని ముస్కాన్ అబద్ధం చెబుతూ వచ్చింది. దాన్ని నిజం చేయడానికి ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి వెళ్లారు. వారితో పాటు సౌరభ్ ఫోనును కూడా తీసుకెళ్లారు. అతడి ఫోన్ నుంచి సోషల్ మీడియాలో ఫొటోలు అప్లోడ్ చేస్తూ వచ్చారు. అయితే, సౌరభ్ ఫోనుకు అతడి కుటుంబసభ్యులు ఫోన్ చేసినపుడు మాత్రం కాల్ లిఫ్ట్ చేసే వారు కాదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముస్కాన్, సాహిల్ మీద అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అసలు విషయం బయట పడింది. తామే సౌరభ్‌ను చంపేశామని ఒప్పుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

Updated Date - Mar 19 , 2025 | 03:21 PM

News Hub