PM Modi : బయోటెక్నాలజీ పరిశోధనల్లో మైలురాయి
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:59 AM
భారత ప్రధాని నరేంద్ర మోదీ 10వేల మంది భారతీయుల జన్యుక్రమ విశ్లేషణ(జీనోమ్ సీక్వెన్సింగ్) సమాచారాన్ని గురువారం విడుదల చేశారు. జీనోమ్ ఇండియా డేటాలోని ఈ సమాచారం విడుదల బయోటెక్నాలజీ పరిశోధనల్లో
10 వేల మంది భారతీయుల జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం విడుదల చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జనవరి 9: భారత ప్రధాని నరేంద్ర మోదీ 10వేల మంది భారతీయుల జన్యుక్రమ విశ్లేషణ(జీనోమ్ సీక్వెన్సింగ్) సమాచారాన్ని గురువారం విడుదల చేశారు. జీనోమ్ ఇండియా డేటాలోని ఈ సమాచారం విడుదల బయోటెక్నాలజీ పరిశోధనల్లో ఓ మైలురాయిని పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన జీనోమ్ కాన్‌క్లేవ్‌లో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ ఈ సమాచారాన్ని విడుదల చేశారు. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్(ఐబీడీసీ) అధీనంలో ఉండే ఈ సమాచారాన్ని పరిశోధన సంస్థలు అనుమతితో వినియోగించుకోవచ్చు. అయితే, ఈ కార్యక్రమానికి వీడియో సందేశం పంపిన మోదీ.. ఐఐటీలు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎ్‌సఐఆర్), బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్(బీఆర్‌ఐసీ) వంటి 20 ప్రఖ్యాత సంస్థల కృషి వల్ల ఈ సమాచార సేకరణ జరిగిందని తెలిపారు. జన్యుపరమైన వ్యాధులు, అంటువ్యాధుల చికిత్సకు అధునాతన వైద్య విధానాల రూపకల్పనకు, వివిధ వర్గాలకు చెందిన ప్రజల జీవన విధానాలు, అలవాట్ల అధ్యయనానికి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ డేటా ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు.