Share News

Sunita Williams: ఆస్ట్రనాట్ సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:43 PM

సునీతా విలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమ్మీద అడుగుపెట్టనుంది. ఆమెతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన బచ్ విల్మోర్ కూడా కిందకు రానున్నాడు. నాసా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Sunita Williams: ఆస్ట్రనాట్ సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ
Sunita Williams

నాసా ఆస్ట్రనాట్ సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ భావోద్వేగపూరిత లేఖ రాశారు. ఆ లేఖలో .. ‘ నువ్వు సాధించిన విజయానికి 1.4 బిలియన్ల భారతీయులు ఎంతో గర్విస్తున్నారు. నువ్వు వేల మైళ్ల అవతల ఉన్నావని తెలుసు. అయినా కానీ, నువ్వు ఎప్పుడూ మా గుండెలకు చాలా దగ్గరగా ఉంటావు. భారతదేశంలోని ప్రజలు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, విజయం సాధించాలని కోరుకుంటున్నారు. నువ్వు భూమి పైకి తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా ఇండియాకు రా. భారత ఖ్యాతిని పెంచే నీలాంటి కూతుళ్లకు ఆతిధ్యం ఇవ్వటాన్ని భారత్ ఎంతో గౌరవంగా భావిస్తుంది. నువ్వు, మిస్టర్ బ్యారీ విల్‌మోర్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఈ లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.


రేపు ఈపాటికి భూమి మీదకు..

సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రనాట్ బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలల నుంచి అక్కడే ఉన్నారు. 9 నెలల నుంచి నాసా వారిని భూమ్మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఇప్పటికి ఆ ప్రయత్నం విజయం సాధించింది. బుధవారం ఉదయం వారిద్దరూ భూమ్మీదకు అడుగుపెట్టనున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా కాలమానం ప్రకారం సాయంత్రం 5.57 గంటలకు అంటే మన భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.37 గంటలకు వారు ప్రయాణించిన క్యాప్సూల్‌ ఫ్లోరిడా సమీపంలోని సముద్రంలో దిగనుంది.


వాళ్లను తీసుకురావడానికి నలుగురు ఆస్ట్రనాట్‌లు వెళ్లారు. క్రూ డ్రాగన్‌ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఇరుక్కుపోయిన ఇద్దరు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన ఈ నలుగురు మొత్తం ఆరుగురు రేపు భూమ్మీదకు వస్తారు. సముద్రం నుంచి ఒక్కొక్కరిగా అందరినీ బయటకు తీసుకువస్తారు. వారు కిందకు దిగే కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది వారు భూమ్మీదకు వచ్చే ఘట్టం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు పెద్ద సంఖ్యలో జనం దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Updated Date - Mar 18 , 2025 | 04:03 PM