Share News

భార్య కన్నింగ్ ప్లాన్.. భర్తను చంపి.. అతడి వాట్సాప్ నుంచి..

ABN , Publish Date - Mar 19 , 2025 | 07:41 PM

రోజులు గడుస్తున్నాయి. పొరిగింటి వాళ్లు ముస్కాన్‌ను సౌరభ్ గురించి అడుగుతూ ఉన్నారు. అతడు హిల్ స్టేషన్‌కు వెళ్లాడని ముస్కాన్ అబద్ధం చెబుతూ వచ్చింది. దాన్ని నిజం చేయడానికి ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి వెళ్లారు.

భార్య కన్నింగ్ ప్లాన్.. భర్తను చంపి.. అతడి వాట్సాప్ నుంచి..
Merchant Navy Officer

మర్చంట్ నావీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అతడి భార్య ముస్కాన్ కన్నింగ్ ప్లాన్లన్నీ వెలుగు చూస్తున్నాయి. ముస్కాన్ భర్తను చంపిన తర్వాత అతడి మొబైల్ ఫోన్ వాడటం మొదలెట్టింది. మార్చి 6వ తేదీన సౌరభ్ చెల్లెలికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టింది. వారిద్దరి మధ్యా ఈ విధంగా వాట్సాప్ ఛాటింగ్ జరిగింది. ‘నువ్వు హోలీకి మీరట్‌లోనే ఉంటావా?..’ అని ముస్కాన్ అడిగింది. దానికి సౌరభ్ చెల్లెలు ‘ అవును’ అని సమాధానం ఇచ్చింది. తర్వాత ముస్కాన్ సౌరభ్ చెల్లెలికి మెసేజ్ చేయలేదు. హోలీ రోజు సౌరభ్ చెల్లెలు ‘హ్యాపీ హోలీ’ అంటూ మెసేజ్ పెట్టింది. దానికి కూడా రిప్లై రాలేదు. శనివారం రోజున సౌరభ్ చెల్లెలు అన్న వాట్సాప్‌కు మళ్లీ మెసేజ్లు చేసింది.


‘ సౌరభ్ నువ్వు ఎప్పుడు వస్తావు? ’ అని అడిగింది. దానికి ముస్కాన్ ‘ చెప్తాను’ అంటూ సమాధానం ఇచ్చింది. ‘రేపు నేను వెళ్లిపోతున్నాను. అందుకే అడుగుతున్నాను’ అంటూ సౌరభ్ చెల్లెలు బాధపడింది. దానికి ముస్కాన్ సమాధానం ఇస్తూ.. ‘ ఓ పార్టీ ఉంది. నేను అక్కడికి వెళుతున్నాను. ఎప్పుడొస్తానో తెలీదు’ అని అంది. సౌరభ్ చెల్లెలు కోపంగా ‘ చల్ .. నువ్వు ఎంజాయ్ చేసుకో..’ అని అంది. ముస్కాన్ సౌరభ్ చెల్లెలికి అనుమానం రాకుండా చాలా నేర్పుగా, ఓర్పుగా చాటింగ్ చేసింది. అంతేకాదు.. జనాలను నమ్మించడానికి భర్త ఫోన్‌ను తీసుకుని ప్రియుడితో కలిసి మనాలి వెళ్లింది. అక్కడ ఫొటోలు తీసి సౌరభ్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయటం మొదలుపెట్టింది. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా చివరకు పోలీసులకు దొరికిపోయింది.


ప్రేమ పెళ్లి.. స్నేహితుడితో అక్రమ సంబంధం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్ రస్తోగి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నావీలో పని చేస్తూ ఉండేవాడు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి ఉద్యోగం మానేశాడు. ఇక అప్పటినుంచి కుటుంబంలో అలజడి మొదలైంది. ఇంట్లో వాళ్లు మళ్లీ జాబ్‌లో జాయిన్ అవ్వమని గొడవపెడుతూ ఉండేవారు. దీంతో భార్యతో కలిసి బయటకు వచ్చేశాడు. వేరు కాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడబిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత అతడికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. ముస్కాన్ ఆమె స్నేహితుడు సాహిల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసింది. భార్యాభర్తలు గొడవలు పడ్డారు. విడాకులు తీసుకోవాలనుకున్నారు. అయితే, బిడ్డ కోసం సౌరభ్ ఆగిపోయాడు. మళ్లీ ఉద్యోగంలో జాయిన అయ్యాడు. 2023లో విదేశాలకు వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి అతడ్ని చంపేసింది. ఇద్దరూ శవాన్ని 15 ముక్కలు చేసి, డ్రమ్‌లో పడేశారు. తర్వాత డ్రమ్మును సిమెంట్‌తో కప్పేశారు. సౌరభ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో మర్డర్ విషయం బయటకు వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

Updated Date - Mar 19 , 2025 | 10:19 PM