Share News

OYO Rooms: అమ్మాయితో ఓయో రూమ్‌కు వెళ్తున్నారా.. మీ ఆశలు ఇక గల్లంతే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:26 PM

ఓయో హోటల్స్ కొత్త చెక్ ఇన్ రూల్స్ రూపొందించింది. ఇకపై వివాహం కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నిబంధనను తొలుత ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అమలుచేయనుండగా.. రానున్న రోజుల్లో దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది.

OYO Rooms: అమ్మాయితో ఓయో రూమ్‌కు వెళ్తున్నారా.. మీ ఆశలు ఇక గల్లంతే..
OYO Rooms

పెళ్లికి ముందే ప్రైవసీ కోసం ఎక్కువమంది ఎంచుకునే ఆప్షన్ ఓయో రూమ్స్. వివాహంతో సంబంధం లేకుండా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగిన వ్యక్తులు ఒయో రూమ్స్‌కు వెళ్తుంటారు. స్త్రీ, పురుషుల గుర్తింపు కార్డు చూపించి, టారిఫ్ చెల్లిస్తే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా రూమ్స్ కేటాయిస్తారు. ఎక్కువమంది కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిలు ఓయో సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఓయో సర్వీసెస్‌ను తప్పుపడుతున్నారు. తమ పిల్లలు చెడిపోవడానికి ఇవి కారణమవుతున్నాయని విమర్శించేవాళ్లు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఓయో హాస్పిటాలిట సేవలను అందిస్తోంది. తక్కువ ధరకే రూమ్స్ అందించడంతో ఓయో సర్వీసెస్ తక్కువకాలంలో అందరినీ ఆకర్షించాయి. అదే సమయంలో కపుల్స్ కాకపోయినా పరస్పర అంగీకారంతో అమ్మాయి, అబ్బాయి ఒకే రూమ్‌లో ఉండేందుకుఓయో హోటల్స్ అనుమతిస్తుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న ఘటనల దృష్ట్యా ఓయో హోటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.


వారికి నో ఎంట్రీ..

ఓయో హోటల్స్‌లో రూమ్ బుక్ చేసుకోవడం ఎంతో ఈజీ. ఓయో యాప్‌లో రూమ్ బుక్ చేసుకుని, నేరుగా హోటల్‌కు వెళ్తే గది కేటాయిస్తారు. రూమ్‌లో ఉండే వ్యక్తుల గుర్తింపు కార్డు జిరాక్స్ హోటల్ రిసెప్షన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అంతేతప్ప మిగిలిన ఏ వివరాలు అడగరు. ముఖ్యంగా ప్రైవసీ కోరుకునేవారికి ఓయో రూమ్స్‌ అనువైన ప్రదేశంగా చెబుతారు. ఇప్పటివరకు ఎవరైనాఓయోలో రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా.. తాజాగా ఒయో పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వబోమనే కొత్త రూల్ తీసుకొచ్చింది. ఓయో తీసుకొచ్చిన నూతన చెక్ ఇన్ పాలసీలో పెళ్లి కాని జంటలు రూమ్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అమలు చేస్తోంది. ఆ తర్వాత ఈ విధానాన్ని దేశమంతా విస్తరించే ఛాన్స్ ఉంది. ఇకనుంచి రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే గుర్తింపు కార్డును సమర్పించాలి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాస్ శర్మ తెలిపారు.


గుర్తింపు చూపిస్తే..

ఎవరైనా జంటలు ఓయో‌లో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే వివాహ ధృవీకరణ లేదా, కపుల్స్‌గా దృవీకరించే ఏదైనా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. గతంలో వలె రూమ్స్ బుక్ చేసుకునే విధానంలో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓయో నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. ప్రేమికులకు మాత్రం ఇది షాకింగ్‌ అనే చెప్పుకోవాలి. జంటగా ధృవీకరించే పత్రాలు బుకింగ్ సమయంలో సమర్పించకపోతే వారికి రూమ్ బుక్ కాదనే చెప్పుకోవాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 05 , 2025 | 05:26 PM