Social Media: తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ‘సోషల్’ ఖాతా!
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:45 AM
పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ప్రతిపాదిత డిజిటల్ డేటా రక్షణ చట్టం నిబంధనల్లో పేర్కొంది.
న్యూఢిల్లీ, జనవరి 3: పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ప్రతిపాదిత డిజిటల్ డేటా రక్షణ చట్టం నిబంధనల్లో పేర్కొంది. సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థలు పిల్లల వ్యక్తిగత వివరాలు నమోదు చేయడానికి ముందే వారి తల్లిదండ్రుల ఆమోదం(వెరిఫైయబుల్ కన్సెంట్) తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొంది. ఈమేరకు వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణ నిబంధనల డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 18 తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకొంటారు.