Share News

Parliament sessions.. ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ABN , Publish Date - Jan 29 , 2025 | 10:34 AM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (30వ తేదీ) కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కొరనున్నారు.

Parliament sessions.. ఈనెల 31 నుంచి  పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
Parliament sessions

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Budget sessions) శుక్రవారం (31వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt)30న (గురువారం) ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం (All-party meeting) నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Rajnath Singh) నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్‌పై అఖిలపక్షానికి కేంద్రం తరఫున రాజనాథ్ సింగ్ వివరించనున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కొరనున్నారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఉభయసభలను ఉద్దేశించి లోకసభ ఛాంబర్ లొనే ప్రసంగించనున్నారు.


గతంలో ఉభయ సభలు ప్రస్తుత సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో కార్యక్రమం జరిగేది. ఇప్పుడు సెంట్రల్ హాలు నుంచి లోకసభ ఛాంబర్‌కు మార్పు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సుమారు అరగంట సేపు విడివిడిగా ఉభయసభలు భేటీ కానున్నాయి. శుక్రవారం రోజునే ఆర్థిక సర్వే పార్లమెంటు ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోకసభలో ఆర్థిక సర్వే టేబుల్ చేయనున్నారు. 2019 నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవంటి..

ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఆ భర్త ఏం చేశాడంటే...


ఈసారి రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తరువాత మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించనున్నారు. కాగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌‌ పార్లమెంటులో ప్రవేశపెడతారు. బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..

GSLV F-15 రాకెట్‌.. ప్రయోగం విజయవంతం..

మీ సమస్యకు మా పరిష్కారం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 29 , 2025 | 10:34 AM