Prashant Kishor: ఆయన శారీరకంగా అలసిపోయారు, మానసిక స్థిమితం కోల్పాయారు
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:26 PM
నితీష్ కుమార్ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుసుకునే పరిస్థితిలో లేరని, కనీసం తన కౌన్సిల్‌లో మంత్రుల పేర్లు కూడా ఆయన చెప్పలేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

సమస్టిపూర్: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)పై జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ శారీరకంగా అలసిపోయారని, మానసిక పరిస్థితి సరిగా లేదని, దీంతో ఆయన పాలన విషయంలో రాజీపడుతున్నారని ఆరోపించారు. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
S Jaishankar: వాణిజ్య ఒప్పందాలు వాస్తవం, భారత్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం
ఆదివారంనాడిక్కడ మీడియాతో ప్రశాంత్ కిషోరో మాట్లాడుతూ...''నితీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన మిత్రపక్షం నేత సుశీల్ కుమార్ మోదీ తొలిసారి మాట్లాడారు. ఆ తర్వాత పలువురు బీహార్ మంత్రులు కూడా వ్యాఖ్యానించారు. గత జనవరి వరకూ నేను ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ బీపీఎస్‌సీ నిరసనల తర్వాత నితీష్ కుమార్ మానసిక స్థితి క్షీణించిందని తెలిసింది. ఆ కారణంగానే రాష్ట్రంలో ఏమి జరుగుతోందో కూడా తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఆయన శారీరకంగా అలసిపోయారు. మానసికంగా ఫిట్‌నెస్‌తో లేరు. ఇందుకు సాక్ష్యం కావాలంటే ఆయన కౌన్సిల్‌లో మంత్రుల పేర్లు అడిగి చూడండి. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడం మంచిది'' అని సూచించారు. ఇందులో బీజేపీకి కూడా సమాన బాధ్యత ఉందని, నితీష్ కుమార్ మానసిక స్థితి కోల్పోయిన విషయం ప్రధానికి కానీ, హోం మంత్రికి కానీ తెలిసినట్టు లేదని అన్నారు.
తేజస్విదీ అదే మాట..
కాగా, నితీష్ మానసిక, శారీరక దారుఢ్యాన్ని కోల్పోయారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇటీవల కాలంలో పలుమార్లు విమర్శలు గుప్పించారు. నితీష్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఒక కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా నితీష్ మాట్లాడుతున్న వీడియోను గత గురువారంనాడు ఆయన షేర్ చేశారు. యువకులు, విద్యార్థులు, మహిళలు, వయోవృద్ధులను ప్రతిరోజూ అవమానించే ముఖ్యమంత్రి కనీసం జాతీయ గీతాన్నైనా అమానించకుండా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..