Share News

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:36 AM

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం ద్వారా హిందీని నిర్బంధంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చిలో డీఎంకే న్యాయవిభాగం సభ్యులు ఆదివారం ఆందోళన చేపట్టారు.

 Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

చెన్నై, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం ద్వారా హిందీని నిర్బంధంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చిలో డీఎంకే న్యాయవిభాగం సభ్యులు ఆదివారం ఆందోళన చేపట్టారు. పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌ నేమ్‌బోర్డులో హిందీ భాషలో ఉన్న స్టేషన్‌ పేరుకు తారుపూశారు.

BH.jpg

ఆ తర్వాత రైల్వేస్టేషన్‌ ఎదుట నిలిచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎంకే కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయిన పావుగంట కల్లా రైల్వే అధికారులు హిందీ తెలిసిన పెయింటర్‌ను తీసుకువచ్చి నేమ్‌బోర్డుపై తారుపూసిన చోట పసుపురంగు పెయింట్‌ పూసి, ఆ చోట మళ్లీ హిందీలో స్టేషన్‌ పేరు రాయించారు.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:36 AM