Rahool Kanal: కునాల్ కమ్రాకు గుణపాఠం చెబుతామంటూ వార్నింగ్.. ఎవరీ రాహుల్ కనల్?
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:40 PM
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేపై కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో స్టూడియోపై దాడి చేసిన రాహుల్ కునాల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అసలు ఎవరీ రాహుల్ కనల్? ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వివాదంలో స్యూడియోపై దాడికి పాల్పడిన కేసులో ఇటీవల అరెస్టయిన శివసేన నేత రాహుల్ కనల్‌కు అదే రోజున బెయిల్ లభించింది. శివసేన అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేను ద్రోహిగా పేర్కొంటూ కామెడి షోలో కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన శివసేన కార్యకర్త రాహుల్ కనల్, ఇతర నాయకులు షో జరిగిన స్టూడియోలో బీభత్సం సృష్టించారు.
రాహుల్ తన చర్యలను సమర్ధించుకున్నాడు. ‘‘ఇది ట్రెయిలర్ మాత్రమే. మా నేతలు, మా పెద్దల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే మేము వాళ్లను వదిలిపెట్టము. కునాల్ కమ్రా ముంబైలో ఎక్కడున్నా సరే.. శివసేన స్టైల్‌లో గుణపాఠం చెబుతాము’’ అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
Also Read: కూతవేటు దూరంలో హత్య జరుగుతున్నా పోలీసుల నిద్ర.. వీడియో వైరల్
ఎవరీ రాహుల్ కనల్
రాహుల్ సామాజిక కార్యకర్త. దాతృత్వ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటూ ఉంటాడు. 2005లో యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కామర్స్ డిగ్రీ పొందాడు.
పార్టీలో చీలికకు మునుపు శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరేకు సన్నిహితుడిగా ఉండేవాడు. శివసేన యూత్ వింగ్ కార్యకలాపాల్లో పదేళ్ల పాటు విస్తృతంగా పాల్గొన్నాడు. సోషల్ మీడియా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడ పనిచేశాడు.
2023 జులైలో శివసేన (యూబీటీ)ని వీడి ఏక్‌నాథ్ శిండే వర్గంలో చేరాడు. పార్టీ యువసేన విభాగానికి జెనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.
Also Read: ఫిరాయింపులపై గత తీర్పులను ఎలా మార్చగలం.. సుప్రీం కోర్టు ప్రశ్న
ఐ లవ్ ముంబై అనే సంస్థను స్థాపించాడు. ప్రస్తుతం సంస్థ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక శిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడిగా కూడా కొంతకాలం సేవలండించాడు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ కమిటీ సభ్యుడిగా, పికిల్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.
అతడికి ముంబైలో భాయిజాన్స్ అనే రెస్టారెంట్ కూడా ఉంది. బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరుమీద రెస్టారెంట్ ఏర్పాటు చేసుకున్నాడు.