Home » Shiv Sena
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే స్థానిక సంస్థల్లో పోటీకి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీతో అవిభక్త శివసేన పొత్తు ఉన్నప్పుడు కూడా బీఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసిందని గుర్తుచేశారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.
బీజేపీ నుంచి 19 మంది, 11 మంది షిండే శివసేన నుంచి, తొమ్మిది మందిని ఎన్సీపీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయుంచారు.
సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, కానీ కొన్ని సార్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం మాత్రం బీజేపీ బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆదిత్య థాకరే తప్పు పట్టారు.
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్‌ను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారంనాడు నియమించారు. తక్కిన 287 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. డిసెంబర్ 9న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
ఆదిత్య థాకరే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి 8,801 ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు. ఆయనకు 63,324 ఓట్లు పోల్ కాగా, షిండే శివసేన నేత మిలంద్ దేవరకు 54,523 ఓట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత సందీప్ సుధాకర్ దేశ్‌పాండేకు 19,367 ఓట్లు పోలయ్యాయి.
షైని ఎన్సీపై అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగానే కొందరు తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
'మహా వికాస్ అఘాడి' కూటమి మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్‌పవార్ ఎన్సీపీ సమానంగా 85-85-85 సీట్లకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. 288 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండటంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి' కూటమి సీట్ల పంపకాలపై కీలక అడుగు పడింది.