Rahul Gandhi: పరువు నష్టం దావాలో రాహుల్‌కు బెయిల్
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:49 AM
పరువు నష్టం దావాలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి శుక్రవారం ఇక్కడి ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా కూడా మినహాయింపు ఇచ్చింది.
పుణె, జనవరి 10: పరువు నష్టం దావాలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి శుక్రవారం ఇక్కడి ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా కూడా మినహాయింపు ఇచ్చింది. రూ.25,000 పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 18కు వాయిదా పడింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన కార్యక్రమంలో హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ ఆయన మునిమనుమడు రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు.