Share News

Rahul Gandhi: అసమానత్వం, వివక్షపై నిజం నిగ్గుతేలాలి.. కులగణనపై మళ్లీ రాహుల్ వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:34 PM

అసమానత్వం, వివక్షపై నిజానిజాలు బయటపడాలంటే కులగణన అనేది కీలకమైన అడుగు అవుతుందని, దీనిని వ్యతిరేకిస్తున్నా వారు మాత్రం నిజాలు బయటపడరాదని కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు.

Rahul Gandhi: అసమానత్వం, వివక్షపై నిజం నిగ్గుతేలాలి.. కులగణనపై మళ్లీ రాహుల్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కులగణన డిమాండ్‌ను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి లేవనెత్తారు. అసమానత్వం, విపక్షపై నిజం నిగ్గుతేలాలంటే కులగణన (Caste census) కీలకమైన ముందడుగు అవుతుందని చెప్పారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మాజీ చైర్మన్, విద్యావేత్త సుఖ్‌దేవ్ థోరట్‌తో తాను ముఖాముఖీ జరిపిన ఒక వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పోస్ట్ చేశారు.

MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్


"ప్రముఖ విద్యావేత్త, ఆర్థికవేత్త, దళిత అంశాలపై నిపుణుడు, తెలంగాణలో కులగణనపై అధ్యయన కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ థోరట్‌తో సమగ్రమైన చర్చ జరిపాను. మహద్ సత్యాగహపైన, అడ్మినిస్ట్రేషన్, విద్య, బ్యూరోక్రసీ, వనరుల విషయంలో దళితులు జరుపుతున్న పోరాటంపైన చర్చించడం జరిగింది'' అని రాహుల్ తెలిపారు. ఇది సమానత్వం, గౌరవానికి సంబంధించిన పోరాటమని, 98 ఏళ్ల క్రితం మొదలైన ఈ పోరాటం ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. అసమానత్వం, వివక్షపై నిజానిజాలు బయటపడాలంటే కులగణన అనేది కీలకమైన అడుగు అవుతుందని, దీనిని వ్యతిరేకిస్తున్నా వారు మాత్రం నిజాలు బయటపడరాదని కోరుకుంటున్నారని అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కల ఇప్పటికీ అసంపూర్తిగానే మిలిగిపోయిందని, ఇది గతానికి చెందిన పోరాటం మాత్రమే కాదని, ఇప్పటికీ పోరాటం సాగుతోందని, పూర్తి శక్తియుక్తులతో అంతా కలిసి పోరాడాలని రాహుల్ అన్నారు.


రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పికొట్టింది. రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆశ్రితపక్షపాతం, ఫ్యూడల్ మనస్తత్వాన్ని చాటుతోందని ఆ పార్టీ నేత సీఆర్ కేశవన్ అన్నారు. ప్రజాజీవితంలో కఠోర శ్రమతో ఎంతో పేరు తెచ్చుకున్న ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ నేతలను నిరంతరం అవమానపరచే చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు.


ఇవి కూడా చదవండి

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే

Read Latest National News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 04:34 PM