Railway Recruitment: రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు టెన్త్ పాస్ చాలు
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:47 AM
రైల్వే శాఖలో పలు విభాగాల్లోని లెవల్-1(గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి విద్యార్హతలను సడలిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, జనవరి 3: రైల్వే శాఖలో పలు విభాగాల్లోని లెవల్-1(గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి విద్యార్హతలను సడలిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. నూతన ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(ఎన్‌సీవీటీ) జారీ చేసిన జాతీయ అప్రెంటి్‌సషిప్ సర్టిఫికెట్(ఎన్‌ఏసీ) కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.