Share News

భర్త నాలుక కొరికేసిన భార్య.. చివర్లో ట్విస్ట్ మామూలుగా ఉండదు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:47 PM

భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. 20వ తేదీ కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా భార్య.. భర్త నాలుకను కొరికేసింది. ఆ తర్వాత ఆ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.

భర్త నాలుక కొరికేసిన భార్య.. చివర్లో ట్విస్ట్ మామూలుగా ఉండదు..
Rajasthan

ఆలు, మగలు.. జగడాలు.. ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు లేవు అంటే.. వాళ్ల మధ్య రిలేషన్ సరిగా లేదని అర్థం. అయితే, మొగుడు పెళ్లాల గొడవలకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటితే అనార్థాలు తప్పవు. కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలు కూడా దారుణాలకు దారి తీస్తూ ఉంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవపడ్డ భార్య అతడి నాలుక కొరికేసింది. దీంతో భర్త ఆస్పత్రి పాలయ్యాడు. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్లాల్సిందే..


రాజస్థాన్, జల్వార్ జిల్లాలోని బకానీ పట్టణానికి చెందిన కన్హయ్యాలాల్ సేన్, రవీనా సేన్ భార్యాభర్తలు. ఆరు నెలల క్రితమే వీరికి పెళ్లయింది. పెళ్లయిన కొంతకాలం వీరు బాగానే ఉన్నారు. తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. తరచుగా ఏదో ఒక విషయం మీద గొడవలు పడుతూనే ఉన్నారు. మార్చి 20వ తేదీన కూడా వీరిద్ధరి మధ్యా గొడవ జరిగింది. ఈ సారి గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా తయారైంది. ఇద్దరూ కలబడి కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే రవీనా భర్త నాలుకను కొరికేసింది. నాలుక రెండుగా తెగి కిందపడటంతో కన్హయ్యాలాల్ అల్లాడిపోయాడు. గట్టిగా అరుస్తూ ఏడవ సాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.


నాలుకను పరీక్షించిన వైద్యులు.. దాన్ని తప్పకుండా అతికిస్తామని భరోసా ఇచ్చారు. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త నాలుక కొరికేసిన తర్వాత రవీనా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి చేతిని కోసుకుంది. ఆమెను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక, ఈ సంఘటనలపై పోలీసులకు సమాచారం అందింది. భర్త నాలుక కొరికినందుకు రవీనాపై కేసు నమోదు అయింది. ఆ తర్వాత రవీనా ఆత్మహత్యకు సంబంధించి కన్హయ్యాలాల్ సోదరుడి మీద కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భర్త నాలుక కొరికేసిన భార్య సంఘటనలు గతంలోనూ జరిగాయి. గొడవల నేపథ్యంలోనే భార్యలు.. భర్తల నాలుకను కొరికేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

MPs Salary Hike: ఎంపీల జీతాల పెంపు.. పూర్తి వివరాలివే

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

ఉద్యోగం లేదు.. చేతిలో రూపాయి లేదు.. కట్ చేస్తే రాత్రికి రాత్రే

Updated Date - Mar 25 , 2025 | 03:08 PM